ఛోటా భీమ్ కంపెనీతో లక్షల్లో సంపాదించే అవకాశం.. ఎలా అంటే..?

0
203

పిల్లలు, యువతీ యువకులు ఎంతో ఇష్టపడే కార్టూన్ ప్రోగ్రామ్స్ లో ఛోటా భీమ్ కూడా ఒకటి. ఈ యానిమేషన్ ప్రోగ్రామ్ కు లక్షల సంఖ్యలో వ్యూస్ ఉంటాయి. తొమ్మిది సంవత్సరాల ఛోటా భీమ్ అనే శక్తివంతమైన కుర్రాడు ఢోల‌క్ పూర్ అనే గ్రామంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా రక్షిస్తూ ఉంటాడు. అయితే అతనికి ఎంతో ఇష్టమైన లడ్డూ తింటే మాత్రమే ఛోటా భీమ్ రక్షించగలడు. మనలో ఎవరైనా ఛోటా భీమ్ ను చూడకపోయినా ఆ పేరు మాత్రం వినే ఉంటారు.

పిల్లలు ఎంతో ఇష్టంగా చూసే చోటా భీమ్ డబ్బు సంపాదించే అవకాశం కల్పిస్తోంది. ఛోటా భీమ్ ను నిర్మించిన సంస్థ నజారా టెక్నాలజీస్ అనే సంగతి మనకు తెలిసిందే. ఇంటర్నెట్ గేమ్స్ వచ్చిన తొలినాళ్లలో నజారా టెక్నాలజీస్ పేరు మారుమ్రోగింది. ప్రత్యేకంగా వెబ్ కోసమే గేమ్స్ ను రూపొందించి ఈ సంస్థ పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంది. ఎంతో పాపులర్ అయిన ఈ సంస్థ ప్రస్తుతం నిధుల సమీకరణ కొరకు ప్రయత్నాలు చేస్తోంది.

ఐపీఓ ఇష్యూను త్వరలో ప్రారంభించడానికి సిద్ధమవుతున్న నజారా టెక్నాలజీస్ ఆ తర్వాత స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కావడంతో పాటు 900 కోట్ల రూపాయలను పెట్టుబడి రూపంలో సమీకరించాలని భావిస్తోంది. 2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో లిస్ట్ చేయబడని నజారా టెక్నాలజీస్ షేరు ధర 550 రూపాయలుగా ఉండగా ఇప్పుడు ఆ షేరు ధర ఏకంగా 770 రూపాయలకు చేరడం గమనార్హం.

కంపెనీ షేర్ ధరలో రోజురోజుకు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్న నేపథ్యంలో ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ సంవత్సరం కొన్ని ఐపీఓలు పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు ఇచ్చిన నేపథ్యంలో ఆసక్తి ఉన్నవాళ్లు నజారా టెక్నాలజీస్ ఐపీఓలో పెట్టుబడులు పెట్టి అదిరిపోయే లాభాలను పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here