Featured

నాగార్జున కి ఆర్ పి పట్నాయక్ సినిమాల నుండి తప్పుకోవడానికి ఉన్న సంబంధం ఏంటి ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సంగీత దర్శకుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాకుండా తన నటనతో ఎంతోమందిని మెప్పించాడు కూడా. ఒకవైపు ఈ సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే మరో సంగీత దర్శకుల వద్ద పాటలు పాడిన అనుభవం ఆయనకు ఉంది. అలా సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు ఆయన ఒక్కసారిగా సినిమాలకు సంగీతాన్ని అందించడం పూర్తిగా మానేశాను అని ప్రకటించాడు. దీనికి ప్రధాన కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది అనుకునేది అక్కినేని నాగార్జున అని. ఈ వార్తను ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది అంటూనే ఉంటారు.

అయితే ఈ విషయంపై ఆర్.పి.పట్నాయక్ ఎప్పుడు ఎక్కడ చర్చించడానికి ఇష్టపడలేదు. కాకపోతే, ఈ మధ్యకాలంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను ఈ విషయం పై పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆయన అసలు తాను మ్యూజిక్ మానేయడానికి కారణం ఏంటి అని వివరించాడు. అందులో భాగంగానే తాను ఇక మ్యూజిక్ చేయకూడదని నిర్ణయించుకోవడానికి కారణం ‘ నేనున్నాను ‘ సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ఆ సినిమాకు ముందుగా సంగీత దర్శకుడిగా తనని తీసుకున్నారని అందుకు సంబంధించి తాను సినిమాకు కూడా ట్యూన్స్ ఇచ్చినట్లు తెలియజేశాడు. అయితే ఆ సినిమా ఒప్పుకొన్నా సమయంలో ఆర్ పి పట్నాయక్ అమెరికా టూర్ కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆర్పి పట్నాయక్ మేనేజర్ అలాగే ‘నేనున్నాను’ సినిమా చిత్ర బృందానికి మధ్యలో జరిగిన మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. అలా ఆయన అమెరికా టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ సినిమాకు సంబంధించి ఓ పెద్ద వ్యక్తి అంటూ పేరు ప్రస్తావించకుండా అతను తన దగ్గరికి వచ్చి నిన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం వల్ల సినిమా బిజినెస్ జరగడం లేదని చెప్పడంతో తాను ఆశర్యపోయినట్లు తెలియజేశాడు.

దీంతో ఆలోచించిన తర్వాత ఆ క్షణమే ఇక మ్యూజిక్ డైరెక్టర్ వల్ల సినిమా బిజినెస్ పోతుందని నమ్మశక్యంగా లేకపోవడంతో ఆ క్షణమే తాను ఇకపై సినిమాలకు మ్యూజిక్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ సినిమా రంగంలో నిర్మాతలు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది అని తెలిపాడు. అలాంటి నిర్మాతలకి తన వల్ల డబ్బులు రాకుండా అడ్డుపడుతున్నారు అన్న అనుమానంతో ఇకపై తాను మ్యూజిక్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాలని తెలిపాడు. ఇది కేవలం నా డెసిషన్ మాత్రమేనని ఈ విషయానికి సంబంధించి హీరో నాగార్జున కు ఎలాంటి సంబంధం లేదని ఆర్పి పట్నాయక్ క్లియర్ గా తెలియజేశారు. అంతేకాకుండా తాను నాగార్జున గారితో కలిసినప్పుడు తనతో ఆయన ఎప్పుడు బాగానే మాట్లాడతారని, మా మధ్య ఎటువంటి గొడవలు లేవని ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago