“నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను.!!
నేను సైతం విశ్వసృష్టికి అశ్రు నొక్కటి దార పోశాను.!!
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను!!”
2003 వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ చిత్రంలోని ఈ పాట ఒక్కటి చాలు సుద్దాల అశోక్ తేజ అంటే ఏమిటన్నది. నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ప్రజాకవి సుద్దాల హనుమంతు కుమారుడే మన సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ. నల్గొండ లో జన్మించిన సుద్దాల అశోక్ తేజ చిన్నప్పటి నుండే పాటలు రాయడం మొదలు పెట్టారు.
అలా ఉన్నత చదువులు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా జీవితం కొనసాగించారు. తనికెళ్ల భరణి ప్రోత్సాహంతో నమస్తే అన్నా సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దాసరి నారాయణ రావు గారి పరిచయంతో మరిన్ని అవకాశాలు పొందారు. దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో చాలా సినిమాలకు సుద్దాల అశోక్ తేజ పాటలు రాయడం జరిగింది. నిన్నే పెళ్ళాడుతా, ఒసేయ్ రాములమ్మ వంటి చిత్రాలు అశోక్ తేజకు మంచి పేరును తీసుకొచ్చాయి. మొదట విప్లవాత్మక పాటలు రాసినప్పటికీ తర్వాత కాలంలో ప్రేమ పాటలు రాయడం మొదలు పెట్టారు. దాదాపు పన్నెండు వందల చిత్రాల్లో రెండు వేలకు పైగా సినిమా పాటలు రాయడం జరిగింది. 2002 వైజయంతి మూవీస్ బ్యానర్, బి.గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా ఇంద్ర సినిమా విడుదల అయ్యింది.
ఈ సినిమాకి గాను సుద్దాల అశోక్ తేజ ఒక అందమైన పాట రాశారు. “నెమలి కన్నోడ.. నమిలే చూపోడ.. కమిలిపోకుండా తాకాలయ్యో.” ఈ పాట సంగీత దర్శకునికి, సినిమా హీరోకి, నిర్మాతకి నచ్చింది కానీ దర్శకుడు బి.గోపాల్ ఇదివరకు తీసిన సినిమాల్లో అలాంటి లిరిక్స్ ఉన్నాయని ఇంద్ర సినిమాలోంచి ఆ పాటను తీసివేయడం జరిగింది. సుద్దాల అశోక్ తేజకు తెలియకుండా అలా జరగడం తో చాలా బాధపడ్డారు. తర్వాత సుద్దాల అశోక్ తేజ కు మణిశర్మ కలిసినప్పుడు మంచి పాటరాశావు తీసుకు వెళ్ళిపోయావు అని సుద్దాల అశోక్ తేజతో అన్నారు. ఆ తర్వాత ఒకసారి రాఘవేంద్ర రావు ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తీస్తున్నప్పుడు సుద్దాల అశోక్ తేజ రాఘవేంద్రరావుకు కనబడ్డారు. నీవు రాసిన పాట ఏదైనా క్యాన్సిల్ అయిందా.. అయితే చెప్పు ఒకటో నెంబర్ కుర్రాడు లో పెట్టేద్దాం అన్నాడు. అలా రాఘవేంద్రరావుకు నచ్చడంతో ఆ పాటను ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో పెట్టడం జరిగింది.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…