నిరుద్యోగ అభ్యర్థులు జాబ్ నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు నోటిఫికేషన్లను విడుదల చేయగా ఎక్కువ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లు విడుదలైతే నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేయగా మరో భారీ నోటిఫికేషన్ కు సిద్ధమైంది. గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీ కోసం డిసెంబర్ 21న నోటిఫికేషన్ విడుదల కానుంది.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ ను గూగుల్ విడుదల చేయనుంది. ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా అభ్యర్థులు 2021 సంవత్సరం జనవరి లోపు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://ssc.nic.in/ వెబ్ సైట్ లో గ్రూప్ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా 2021 సంవత్సరం మే నెల 9వ తేదీ నుంచి 2021 సంవత్సరం జూన్ నెల 7 వరకు పరీక్షలు జరుగుతాయి.
పోస్టులను బట్టి ఆయా సబ్జెక్టులలో బ్యాచిలర్స్ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. గతేడాది ఇదే సమయంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 9488 ఉద్యోగల భర్తీ చేసింది.
ఈ ఏడాది అంతకంటే ఎక్కువ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్, సబ్ ఇన్‌స్పెక్టర్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…