Tag Archives: sushmitha konidela

Sushmitha: చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత హీరోయిన్ గా నటించారని తెలుసా?

Sushmitha: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మెగా ఆడపడుచుల విషయానికి వస్తే నిహారిక యాంకర్ గా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు.

ఈ విధంగా హీరోయిన్ గా ఈమె సక్సెస్ కాకపోవడంతో నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.ఇక చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. కెరియర్ మొదట్లో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం నిర్మాతగా మారిపోయారు.

ఇకపోతే సుస్మిత కూడా హీరోయిన్గా ఒక సినిమాలో నటించారు అనే విషయం చాలా మందికి తెలియదు. సుస్మితను హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చిరంజీవి ఎన్నోసార్లు అనుకున్నారట అయితే తనని పరిచయం చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఆటంకం రావడం అది కాస్త వాయిదా పడటంతో ఇక తనని హీరోయిన్ గా పరిచయం చేయాలన్న ఆలోచనని కూడా చిరంజీవి విరమించుకున్నారని తెలుస్తుంది.

Sushmitha: ఆగిపోయిన సుస్మిత సినిమా షూటింగ్…


ఇకపోతే చిరంజీవి కుమార్తె సుస్మిత నటుడు ఉదయ్ కిరణ్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. రెండో భాగం కథకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని తెలుస్తుంది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇలా ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో సినిమా విడుదలకు నోచుకోలేదు లేదంటే ఈమె కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేవారని తెలుస్తుంది.

Sushmitha: తీరని మెగా డాటర్ సుస్మిత కోరిక… కోరికగానే మిగిలిపోవాల్సిందేనా?

Sushmitha: మెగా డాటర్ సుస్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె చిరంజీవి పెద్ద కుమార్తెగా అందరికీ ఎంతో సుపరిచితమే. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగడమే కాకుండా ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు. అయితే రామ్ చరణ్ విషయంలో ఈమె కోరిక నెరవేరలేదని తెలుస్తుంది.

ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఉపాసనా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ తనకు మేనల్లుడు పుట్టాలని ఉంది అంటూ తన మనసులోని కోరిక బయట పెట్టారు. ఈమె మాట్లాడుతూ తమకు ఆడపిల్ల అయినా మగ పిల్లాడు అయినా ఒకటేనని కాకపోతే ఇప్పటివరకు మా ఇంట్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలే లేరని తెలిపారు.

అందుకే ఉపాసనకు అబ్బాయి పుడితే చాలా బాగుంటుందని నా కోరిక అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో సుస్మిత తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు. ఇలా సుస్మిత కోరుకున్న ఆ కోరిక తీరలేదని తెలుస్తోంది. సుస్మిత మేనత్తగా మారిన విషయం మనకు తెలిసింది అయితే ఉపాసన మగపిల్లాడికి కాకుండా అమ్మాయికి జన్మనిచ్చారు.

Sushmitha: తీరని సుస్మిత కోరిక…


ఉపాసన రాంచరణ్ దంపతులకు మంగళవారం ఉదయం అమ్మాయి జన్మించిన విషయం తెలిసిందే. అయితే కొడుకు అయితే బాగుంటుందనుకున్న తరుణంలో కూతురు జన్మించడంతో సుస్మిత కోరిక నెరవేరలేదని తెలుస్తుంది. అయితే మగపిల్లాడు పుట్టాలన్న సుస్మిత కోరిక నెరవేరుతుందా లేకపోతే ఉపాసన దంపతులు ఒక అమ్మాయి చాలని భావిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Sushmitha: స్టార్ ప్రొడ్యూసర్లకు షాక్ ఇచ్చిన మెగా డాటర్ సుస్మిత… ఆ విషయంలో తండ్రి మాట కూడా వినట్లేదుగా?

Sushmitha: మెగా డాటర్ సుస్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తెగా ఈమె అందరికీ సుపరిచితమే అయితే ఈమె కూడా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. గోల్డెన్ బాక్స్ బ్యానర్ స్థాపించినటువంటిఈమె ఇదివరకు ఎన్నో వెబ్ సిరీస్ లో చిన్న సినిమాలను నిర్మించారు. అయితే తన నిర్మాణ సంస్థలో తన తండ్రితో కలిసి ఒక సినిమా అయినా నిర్మించడమే తన కోరిక అంటూ పలు సందర్భాలలో తెలియజేశారు.

ఈ విధంగా సుస్మిత ఇన్ని రోజులు మెగాస్టార్ చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతున్నటువంటి ఈమె పూర్తిస్థాయిలో తన తల్లితో కలిసి ఒక సినిమాని చేయాలని భావించారు. అయితే ఈమెకు ఆ అవకాశం రానే వచ్చింది.డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాని సుస్మిత నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ సినిమా విషయంలో సుస్మితకు స్టార్ ప్రొడ్యూసర్ల నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాణ విషయంలో ఇతర స్టార్ ప్రొడ్యూసర్లు కలగజేసుకొని ఈ సినిమాకు అయ్యే పెట్టుబడి మొత్తం తామే పెడతాము కేవలం తమ బ్యానర్ పేరును ప్రకటించడమే కాకుండా సినిమాకు వచ్చే లాభాలలో వాటా ఇవ్వమని అదిరిపోయే డీల్ ఈమె ముందు ఉంచారట.

Sushmitha:నాన్న సినిమా నిర్మించడం కల…


ఇలా స్టార్ ప్రొడ్యూసర్లు ఈమెకు ఇలాంటి ఆఫర్ ఇవ్వడంతో చిరంజీవి కూడా ఇది బెటర్ ఆఫర్ అని భావించి తన కుమార్తెను ఇందుకు ఒప్పుకోమని సూచించారట. అయితే సుస్మిత మాత్రం ఈ విషయంలో తన తండ్రి మాట వినకుండా తనకు ఎప్పటినుంచో తన తండ్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలని ఉంది అయితే తాను ఆ సినిమాని సోలోగానే నిర్మిస్తానని ఇతరుల భాగస్వామ్యం తనకు వద్దని ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

Mega Daughters: కళామందిర్ రాయల్ బ్రాండ్ ప్రారంభించిన మెగా డాటర్స్!

mega daughters: హైదరాబాద్ లో “కళామందిర్ రాయల్” బ్రాండ్ ఘనంగా ప్రారంభం అయింది. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 36లో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రముఖ నటి, సామాజిక వేత్త అమల అక్కినేని, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల స్టోర్ ప్రారంభించారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో దివ్య రెడ్డి, దీపికా రెడ్డి, పద్మజ ల్యాంకో, శుభ్ర మహేశ్వరి, కల్పన తదితరులు హాజరయ్యారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో చీరల రిటైల్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్ కళామందిర్. ఇది ఇప్పుడు జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.36లో తన కొత్త ప్రీమియం బ్రాండ్ “కళామందిర్ రాయల్” గ్రూప్ 49వ షోరూమ్‌తో ముందుకు వచ్చింది. కొత్త బ్రాండ్ కళామందిర్ కి అప్‌ గ్రేడ్ వెర్షన్. ఇది ఎంపిక చేసిన ప్రత్యేకమైన పట్టు సేకరణకు ప్రసిద్ధి చెందింది. కళామందిర్ రాయల్ అనేది చేతితో ఎంపిక చేసిన పట్టు, పైథాని, పటోలా, చేనేత, కోటా, డిజైనర్, ఖాదీ చీరల కోసం ఒక సరికొత్త స్టోర్. కొత్త స్టోర్ ఒక రకమైన ప్రీమియం ఎలివేషన్ మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇంటీరియర్‌లను ఆకర్షణీయంగా కలిగి వుంటుంది.

పేరు సూచించినట్లుగా, కళామందిర్ రాయల్ అనేది స్త్రీకి చీరల దేవాలయం, ఆమె తనకు మునుపెన్నడూ లేని. అందాన్ని జోడించుకోవాలని కోరుకుంటుంది. ఇది మహిళలకు కొత్త నివాసం, వారికి ప్రత్యేకంగా రూపొందించిన చీరలను తీసుకువస్తుంది. ఇక్కడ ఉన్న చీరలు స్త్రీల కోసం ప్రతిభావంతులైన నేత కార్మికులతో అంతర్గత డిజైనర్ల సమక్షంలో నేస్తారు. ఇక్కడ ఉన్న చీరలు ఇతర డిజైనర్ బ్రాండ్‌లకు భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే అవి సరసమైన ధర ట్యాగ్‌లతో మీకు అందుబాటులో వుంటాయి.

ఈ సందర్భంగా కళామందిర్ రాయల్ డైరెక్టర్ కళామందిర్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కళామందిర్ రాయల్ దివ్యమైన ప్రదేశమని, నేటి మహిళా ప్రమాణాలకు తగ్గట్టుగా అత్యంత నిశితంగా, అపూర్వంగా రూపొందించిన ఉత్పత్తులు కళామందిర్ రాయల్ మొదటి స్థానంలో నిలుస్తాయన్నారు. ప్రత్యేకమైన, ప్రత్యేకమైన చీరల సేకరణను ఇష్టపడే నగర మహిళల కోసం ఈ స్టోర్ ఏర్పాటు చేశాం అన్నారు”