Sushmitha: మెగా డాటర్ సుస్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తెగా ఈమె అందరికీ సుపరిచితమే అయితే ఈమె కూడా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. గోల్డెన్ బాక్స్ బ్యానర్ స్థాపించినటువంటిఈమె ఇదివరకు ఎన్నో వెబ్ సిరీస్ లో చిన్న సినిమాలను నిర్మించారు. అయితే తన నిర్మాణ సంస్థలో తన తండ్రితో కలిసి ఒక సినిమా అయినా నిర్మించడమే తన కోరిక అంటూ పలు సందర్భాలలో తెలియజేశారు.
ఈ విధంగా సుస్మిత ఇన్ని రోజులు మెగాస్టార్ చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతున్నటువంటి ఈమె పూర్తిస్థాయిలో తన తల్లితో కలిసి ఒక సినిమాని చేయాలని భావించారు. అయితే ఈమెకు ఆ అవకాశం రానే వచ్చింది.డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాని సుస్మిత నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ సినిమా విషయంలో సుస్మితకు స్టార్ ప్రొడ్యూసర్ల నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాణ విషయంలో ఇతర స్టార్ ప్రొడ్యూసర్లు కలగజేసుకొని ఈ సినిమాకు అయ్యే పెట్టుబడి మొత్తం తామే పెడతాము కేవలం తమ బ్యానర్ పేరును ప్రకటించడమే కాకుండా సినిమాకు వచ్చే లాభాలలో వాటా ఇవ్వమని అదిరిపోయే డీల్ ఈమె ముందు ఉంచారట.
ఇలా స్టార్ ప్రొడ్యూసర్లు ఈమెకు ఇలాంటి ఆఫర్ ఇవ్వడంతో చిరంజీవి కూడా ఇది బెటర్ ఆఫర్ అని భావించి తన కుమార్తెను ఇందుకు ఒప్పుకోమని సూచించారట. అయితే సుస్మిత మాత్రం ఈ విషయంలో తన తండ్రి మాట వినకుండా తనకు ఎప్పటినుంచో తన తండ్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలని ఉంది అయితే తాను ఆ సినిమాని సోలోగానే నిర్మిస్తానని ఇతరుల భాగస్వామ్యం తనకు వద్దని ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…