Nagachaitanya: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సామాన్య ప్రజలు సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే ఇక సెలబ్రిటీలు గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా లోనే ఉంటూ వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇలా సెలబ్రిటీలందరూ షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుంటుంటే ఒక టాలీవుడ్ హీరో మాత్రం షూటింగ్ లోకేషన్ కి వెళ్ళగానే మొబైల్ ఫోన్ పక్కన పెట్టేస్తాడు. ఆ హీరో మరెవరో కాదు అక్కినేని వారసుడు నాగచైతన్య. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుని తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు.
ఇప్పటివరకు నాగచైతన్య నటించిన ఎన్నో సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం నాగచైతన్య కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచాయి.
ఇదిలా ఉండగా అక్కినేని వంటి ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబం నుండి వచ్చిన నాగచైతన్య అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు. అనవసరమైన విషయాలలో తల దూర్చకుండా తన పని తాను చేసుకు పోతూ ఉంటాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గురించి ఎన్ని విమర్శలు వినిపించినా కూడా నాగచైతన్య మాత్రం వాటి గురించి స్పందించకుండా సైలెంట్ గా ఉంటాడు.
ఇలా ఇంత కామ్ గా ఉండే నాగచైతన్య వృత్తి విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టగానే ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా కేవలం ఆ రోజు షూటింగ్ మీద మాత్రమే దృష్టి పెడతాడు. ఈ క్రమంలో షూటింగ్ లొకేషన్ ఉంటే నాగచైతన్య కనీసం తన ఫోన్ ఉపయోగించడు. కనీసం షాట్ బ్రేక్ లో కూడా సరే ఫోన్ వాడడట. ఈ విషయంలో నాగచైత నేను చూసి తోటి నటీనటులు ఆశ్చర్యపోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…