Kajal Aggarwal: వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే కాజల్ అగర్వాల్ చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఈ విధంగా తనకు కుమారుడు జన్మించిన తర్వాత ఈమె తిరిగి సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే నేడు కాజల్ అగర్వాల్ పుట్టినరోజు కావడంతో తన కొత్త సినిమాని కూడా ప్రకటించారు.
కాజల్ అగర్వాల్ అఖిల్ డేగల దర్శకత్వంలో మరొక లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.సత్యభామ టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో కాజల్ అగర్వాల్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఇలా ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయానికి వస్తే..ఈ సినిమా కోసం ఈమే ఏకంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…