Sekhar Master:ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం మరణించారు. ఇలా రాకేష్ మాస్టర్ మరణించడంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఇతర డాన్స్ కొరియోగ్రాఫర్లు ఆయన శిష్యులు పెద్ద ఎత్తున రాకేష్ మాస్టర్ మృతి పై సంతాపం తెలియజేస్తున్నారు.
ఇక రాకేష్ మాస్టర్ దగ్గర శేఖర్ మాస్టర్ కూడా శిష్యరికం పొందిన విషయం మనకు తెలిసిందే.ఇలా రాకేష్ మాస్టర్ శిష్యుడిగా ఈయన కూడా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే ఒకానొక సమయంలో రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గురించి అతని భార్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య వివాదాలు కూడా తలెత్తాయి.
సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు.అయితే రాకేష్ మాస్టర్ మరణించడంతో శేఖర్ మాస్టర్ అతని చివరి చూపు కోసం వస్తారా రారా అన్న సందేహం కూడా అందరిలో ఉండేది కానీ శేఖర్ మాస్టర్ మాత్రం తన గురువుగారిని ఆఖరి చూపు చూసుకోవడం కోసం తరలివచ్చారు.
ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ పార్థివ దేహాన్ని చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతరం అయ్యారు. ఆయన పార్తివదేహానికి పూలమాలలు సమర్పించి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…