Upasana: మెగా కోడలు ఉపాసన గర్భిణిగా ఉన్న విషయం మనకు తెలిసిందే. నేడు ఉదయం తెల్లవారుజామున ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఈమె డెలివరీ అయ్యారు.ఇక ఈమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు అంటూ అపోలో హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
జూన్ 20వ తేదీ ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారని వైద్యులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారని అపోలో హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ విధంగా ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఆడపిల్ల జన్మించడంతో మెగా ఇంటిలోకి సాక్షాత్తు మహాలక్ష్మి అడుగు పెట్టింది అంటూ అభిమానులు మెగా కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు.ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఉపాసన పెళ్లయిన పది సంవత్సరాలకు తల్లి కావడం విశేషం.
ఉపాసన రాంచరణ్ ఇద్దరు కూడా 2012వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన పది సంవత్సరాలకు ఈమె తల్లి కాబోతుందన్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రకటించారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈమె ఇప్పుడు ఆడపిల్లకు జన్మనిచ్చారనే విషయం తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…