Sushmitha: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మెగా ఆడపడుచుల విషయానికి వస్తే నిహారిక యాంకర్ గా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు.
ఈ విధంగా హీరోయిన్ గా ఈమె సక్సెస్ కాకపోవడంతో నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.ఇక చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. కెరియర్ మొదట్లో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం నిర్మాతగా మారిపోయారు.
ఇకపోతే సుస్మిత కూడా హీరోయిన్గా ఒక సినిమాలో నటించారు అనే విషయం చాలా మందికి తెలియదు. సుస్మితను హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చిరంజీవి ఎన్నోసార్లు అనుకున్నారట అయితే తనని పరిచయం చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఆటంకం రావడం అది కాస్త వాయిదా పడటంతో ఇక తనని హీరోయిన్ గా పరిచయం చేయాలన్న ఆలోచనని కూడా చిరంజీవి విరమించుకున్నారని తెలుస్తుంది.
ఇకపోతే చిరంజీవి కుమార్తె సుస్మిత నటుడు ఉదయ్ కిరణ్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. రెండో భాగం కథకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని తెలుస్తుంది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇలా ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో సినిమా విడుదలకు నోచుకోలేదు లేదంటే ఈమె కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేవారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…