Akhil: అక్కినేని వారసుడుగా అఖిల్ అనే యాక్షన్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు హీరో అఖిల్.వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేకపోయింది ఈ సినిమా తర్వాత అఖిల్ తదుపరి నటించిన సినిమాల్లో కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను నిరాశపరిచాయి.
ఇక అఖిల్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కాస్త పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ సినిమా మంచిగానే కలెక్షన్లు రాబట్టడంతో అఖిల్ తన తదుపరి సినిమాని ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ సీక్వెన్స్ సినిమాగా ఏజెంట్ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకువచ్చింది.
లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అఖిల్ తరచూ ఇలా యాక్షన్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తప్పు చేస్తున్నారు. అయితే ఈయన తదుపరి చిత్రాన్ని యు వి క్రియేషన్ బ్యానర్స్ లో చేస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కూడా ఒక యాక్షన్ సినిమా అని తెలియడంతో అఖిల్ చేసిన తప్పే పదేపదే చేస్తున్నారని ఇలాగైతే ఇండస్ట్రీలో ఈయన కొనసాగడం కష్టమే అంటూ పలువురు ఈయన వ్యవహార శైలి పై కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…