Tag Archives: Sweet

రాత్రి పూట ఇలాంటి పదర్ధాలు తింటున్నారా.. అయితే జాగ్రత్త.. నిపుణులు ఏమంటున్నారంటే..

పని ఒత్తిడిలో పడి తినే ఆహారం కూడా టైంకి తినడం లేదు చాలామంది. దీంతో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆహారం తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. రాత్రి పడుకునే సమయంలో ఏది పడితే అది తినకూడదు. ముఖ్యంగా ఇందులో కొన్ని పదర్దాలు తినడం వల్ల మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తీపి పదర్దాలు అనేవి అందరూ ఇష్టపడుతుంటారు. ఇవి అన్నం తిన్న తర్వాత ఇంకా మధురంగా అనిపిస్తుంటాయి. కానీ ఇవి అన్నం తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదని ఆహార నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మధుమేహం, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.ఒక వేళ మధుమేహ వ్యాధి ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు నూనెలో వేయించిన ఆహార పదర్ధాలకు దూరంగా ఉంటే మంచిదని తెలియజేస్తున్నారు.

సాధారణంగా మన ఆరోగ్యానికి సరైన పోషకాలను అందించేటువంటి బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి క్రూసిఫరస్ కూరగాయలు సాధారణంగా ఆరోగ్యానికి చాలా మంచివి కాని వాటిని పడుకునే ముందు అస్సలు తినకూడదు. సిట్రస్ పండ్లలో విటమిన్ సీ ఉంటుంది. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా మన శరీరములు వ్యాధులతో పోరాడే రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది.

రాత్రి పడుకునే సమయంలో సిట్రస్ జాతి పండ్లను తింటే మాత్రం కడుపులో ఎసిడిటీ పెరిగి గుండెల్లో మంట రావడానికి దారి తీస్తుంది. ఇది మీకు నిద్ర పట్టకుండా చెయ్యడమే కాకుండా తరువాత రోజు కూడా మీకు గుండెల్లో మంటగా ఉంటుంది. కావున ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను రాత్రిళ్లు తినకపోవడమే మంచిది.

బెల్లం కూడా ఇక పంచదార రూపంలో .. ఉత్పత్తి చేయడానికి ఐదు కంపెనీలు ముందుకు.. !

బెల్లంలో అనేక పోషక విలువలు ఉంటాయి.. అయినా కూడా చాలామంది పంచదారనే ఇష్టపడుతుంటారు. పంచదారకు ఉన్నంత డిమాండ్ బెల్లానికి ఉండదు. దానికి గల కారణం పంచదార మనకు పలుకుల రూపలంలో లభించడమే. అందుకే ఎక్కువగా పంచదారను ఇష్టపడతారు. పలుకులుగా ఉండటంతో దానిని సలుభంగా ప్యాకింగ్ చేసి ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లే విధంగా ఉటుంది. అందుకనే దీనిపై మక్కువ ఉంటుంది.

అయితే బెల్లాన్ని కూడా పలుకుల రూపలంలో ఉత్పత్తి చేసేందుకు ఇటీవల అనకాపల్లిలోని ANGRAU యూనివర్సిటీలోని రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ లో ఒక టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీనిపై పేటెంట్ హక్కును కూడా పొందారు. దీంతో దీనికి కావాల్సిన మెషినరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ టెక్నాలజీని 5 కంపెనీలకు నాన్-ఎక్స్‌క్లూజివ్ ప్రాతిపదికన బదిలీ చేసింది.

వోవెల్ టెక్నాలజీస్(మహారాష్ట్ర), చక్రవర్తి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తిరుపతి), కెవిఎల్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్(సికింద్రాబాద్‌), జయలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్(సికింద్రాబాద్‌), శుభం ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(విశాఖపట్నం) కంపెనీలు గ్రాన్యులర్ రూపంలో బెల్లాన్ని ఉత్పత్తి చేయడానికి సిద్ధమవుతున్నాయి.

చక్కెర కంటే బెల్లం శ్రేష్టమైనదని.. అనకాపల్లిలోని RARS లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా వ్యవహరిస్తున్న డా. పీ.వీ.కే జగన్నాధరావు తెలిపారు. దీనిలో సూక్రోజ్ తో పాటు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయని వివరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం PMFME కింద బెల్లం ఉత్పత్తిని పెంచడానికి ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.