Tag Archives: tamilnadu

ప్రియురాలి ఇంట్లో చేపల పులుసు తిన్నాడు.. దారుణంగా?

ఇద్దరు ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో తనతో పెళ్లికి తన ప్రేయసి కుటుంబీకులు ఒప్పుకోలేదు. తర్వాత ప్రియుడు నచ్చజెప్పడంతో పెళ్లికి ఒప్పుకున్న అమ్మాయి తరపు వాళ్ళు నిశ్చితార్థ వేడుకలను నిర్వహించారు. అయితే అత్తగారి ఇంటికి వెళ్ళిన అల్లుడికి అతిధి మర్యాదలు ఎంతో చక్కగా చేశారు.అల్లుడొచ్చాడు అని చేపల పులుసు వండి ప్రియురాలు ఎంతో ప్రేమగా తినిపించడం తో ప్రియుడు ఎంతో మురిసిపోయాడు. చేపల పులుసు తిన్న తర్వాత వాంతులు చేసుకుని మరణించాడు. అతని మరణం వెనుక కారణం ఎవరు? ఇది సహజ మరణమేనా లేక హత్యాయత్నం? అసలేం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళలోని మున్నార్‌కు చెంది నిషాంత్ (30) చెన్నైలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. తమిళనాడులోని అరియలూరు జిల్లా గంగైకొండచోళపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తరపు ఇంట్లో తెలియగానే వీరి పెళ్లికి నిరాకరించారు.నిశాంత్ బలవంతంగా ఒప్పించడంతో పెళ్ళికి ఒప్పుకొని నిశ్చితార్థం కూడా జరిపించారు.

మే 17న వీరు పెళ్లి కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో పెళ్లి వాయిదా పడింది.ఈ క్రమంలోనే నిషాంత్ పనిచేస్తున్న ఆఫీసుకు సెలవులు ప్రకటించడంతో అతను కేరళలో లాక్ డౌన్ ఉన్న కారణంగా కాబోయే తన అత్త వారి ఇంటికి వెళ్ళాడు. అల్లుడొచ్చాడని అత్తింటివారు అల్లుడికి చేపలు వండి భోజనం పెట్టారు.భోజనం తిన్న కాసేపటికే నిషాంత్ కి వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే లోపే నిశాంత్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

చేపల పులుసు తిన్న కుటుంబ సభ్యులందరికీ ఏమీ కాకుండా నిశాంత్ ఒక్కడికే వాంతులు కావడంతో నిశాంత్ కుటుంబ సభ్యులకు అనుమానాలు తలెత్తుతున్నాయి. నిశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిశాంత్ పై హత్యా యత్నం జరిగిందా లేక సహజ మరణమా అనే విషయం తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు వేచి ఉండాలని పోలీసులు తెలిపారు.

వెయ్యి సంవత్సరాలుగా లాక్ డౌన్ లో ప్రజలు.. ఆ గ్రామం ఎక్కడుందంటే..?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల గతేడాది మార్చి నెల 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు కాగా ఆ తరువాత కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అన్ లాక్ సడలింపులను అమలు చేస్తోంది. అయితే కరోనా విజృంభణ వల్లే మన దేశంలోని ప్రజలకు లాక్ డౌన్ అనే పదం తెలిసింది.

అయితే తమిళనాడు రాష్ట్రంలోని ఒక గ్రామంలో మాత్రం వెయ్యి సంవత్సరాలుగా ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ లో ఉన్నారు. తమ ఊరి చుట్టూ గోడను కట్టుకొని లోపల జీవనం సాగిస్తున్నారు. పనుల కోసం పురుషులు మాత్రమే గ్రామం నుంచి బయటకు వెళుతుండగా మహిళలు మాత్రం పూర్తిగా గ్రామానికే పరిమితమవుతున్నారు. దక్షిణ తమిళనాడులోని శ్రీ వైకుంఠం గ్రామంలో మొత్తం 65 కుటుంబాలు ఉన్నాయి.

ఆ ఊరి చుట్టూ వెయ్యి సంవత్సరాల క్రితం పెద్ద మట్టిగోడను నిర్మించారు. ఆ మట్టిగోడకు నాలుగు ద్వారాలు ఉండగా గ్రామంలోకి రావాలన్నా, గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా ఆ నాలుగు మార్గాల ద్వారా మాత్రమే వెళ్లడం లేదా రావడం సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రాకతో పజల జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తుంటే అక్కడ మాత్రం ఇప్పటికీ ప్రజలు ప్రాచీన సంస్కృతినే ఆచరిస్తున్నారు.

మన దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు రెండు నెలల లాక్ డౌన్ కే పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే ఆ గ్రామ ప్రజలు మాత్రం కాలం మారుతున్నా నేటికీ లాక్ డౌన్ చేసుకుని జీవనం సాగిస్తూ ఉండటం గమనార్హం.

రేషన్ కార్డు ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. రూ.2500 నగదు, విలువైన సరుకులు..?

దేశంలోని పలు రాష్ట్రాల్లో హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. కొత్త సంవత్సరం వచ్చిన రెండు వారాలకే వచ్చే ఈ పండుగ సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పండగకు అవసరమైన సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తుంటాయి. అదే విధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది.

పండుగ సరుకులను ఉచితంగా ఇవ్వడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సరుకులను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. 2021 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం పళనిస్వామి ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వారిని దృష్టిలో ఉంచుకుని రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పళనిస్వామి చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 2 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది.

ప్రభుత్వం 2,500 రూపాయల నగదు తో పాటు కిలో బియ్యం, కిలో చక్కెర, చెరుకుగడ, జీడిపల్లు, కిస్ మిస్ 20 గ్రాములు, 5 గ్రాముల యాలకులు ఇవ్వనుంది. అధికారులు రేషన్ కార్డు ఉన్నవాళ్లకు టోకెన్లు జారీ చేయనుండగా టోకెన్లు ఇచ్చి డబ్బులు, సరుకులు ప్రజలకు పంపిణీ జరిగేలా చేయనున్నారు.