Tag Archives: technology

మనసులో ఏం అనుకుంటే.. అది స్క్రీన్ పై కనిపిస్తుంది.. అదెలా అంటే..?

కొంతమందికి పుట్టుకతోనే మాటలు రాకుండా పుడతారు. మరి కొంత మందికి అనుకోని ప్రమాదాల వల్ల నోటి నుంచి మాటలు రాకుండా ఉంటాయి. అయితే వాళ్లు ఏం మాట్లాడేది ఎదుటి వారికి అర్థం కాదు. వాళ్ల కంటూ ప్రత్యేకంగా పాఠశాలలు, కాలేజీలు కూడా ఉన్న విషయం తెలిసిందే. వాళ్లకంటూ ప్రత్యేకంగా కొంత టెక్నాలజీని ఉపయోగించి వారికి అర్థం అయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధిస్తారు.

ఇలా మాటలు రాని వారి వ్యథ ఎవరికీ చెప్పలేక.. వాళ్లల్లో వాళ్లే కుమిలిపోతుంటారు. దీంతో క్షణికావేశంలో ఆత్మహత్యలు కూడా చేసుకున్న వారు ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఓ టెక్నాలజీని రూపొందించారు అమెరికా శాస్త్రవేత్తలు. అందేంటంట.. ‘స్పీచ్‌ న్యూరోప్రోస్థెసిస్‌’. దీనిని ఇటీవల శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు.

ఈ టెక్నాలజీ ద్వారా ముఖ్యంగా పక్షవాతం బారిన పడి మాటలను కోల్పోయిన వారికి మారియు .. పుట్టుకతోనే మాటలు రాని వారి మెదడులో సంకేతాలను మాటలుగా మారుస్తుంది. వారి మెదడు ఏం అనుకుంటుందో.. వాటిని స్క్రీన్ పై కనిపించేలా చేస్తుంది. దీనిని వారు దాదాపు పది సంవత్సరాలకు పైగా శ్రమించి అభివృద్ధి చేశారు.

ఈ టెక్నాలజీ చాలా బాగా పనిచేస్తుందని.. న్యూరోసర్జన్‌ ఎడ్వార్డ్‌ చాంగ్‌ పేర్కొన్నారు. దీని గురించి న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రచురించారు. ఇది ఒక అద్భుతం అని.. మెదడులోని పదాలను డీ కోడ్ చేసి.. మన కళ్ల ముందు కనిపించే స్క్రీన్ పై ఉంచడం అనేది గొప్ప ఆవిష్కరణ అని కొందరు శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు.

చనిపోయిన వారితో మాట్లాడే అవకాశం కల్పించిన మైక్రోసాఫ్ట్?

సాధారణంగా మనకు ఎంతో దగ్గరైనా మన కుటుంబ సభ్యులు, మన ఆత్మీయులు మరణించి దూరమైతే వారికి గుర్తుగా వారితో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నిరంతరం వారిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటారు. ఒక్కసారైనా వారితో మాట్లాడాలని ఎంతో మంది భావిస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోరికలను మైక్రోసాఫ్ట్ తీర్చ బోతోందా? అంటే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ కొత్త టెక్నాలజీని ఉపయోగించి చనిపోయిన వారితో మాట్లాడే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా పనిచేసే ఒక చాట్‌బాట్‌ను రూపొందించింది. దీని ద్వారా చనిపోయిన వ్యక్తికు సంబంధించిన డేటా ఆధారంగా తయారు చేస్తారు. అంటే చనిపోయిన వ్యక్తి వాయిస్, వారి డేటా ఫోటోలు వీడియోలను సేకరించిన అనంతరం ఈ చాట్ బాట్ ద్వారా రూపొందిస్తారు. ఈ విధంగా చాట్ బాట్ రూపొందించడం వల్ల అచ్చం చనిపోయిన వ్యక్తి లాగే మాట్లాడుతుంది. అంతే కాకుండా వారికి తెలిసిన వ్యక్తులను కూడా పలకరిస్తుంది. ఈ చాట్ బాట్ కు మరింత టెక్నాలజీని ఉపయోగించి 2 డి,3డీ లో రూపంలో ఫోటోలను కూడా చేర్చవచ్చు.

ఈ విధంగా మైక్రోసాఫ్ట్ తయారుచేసిన కొత్త టెక్నాలజీ ద్వారా చనిపోయిన వ్యక్తులు తమ దగ్గర ఉన్న భావనను కలిగిస్తుంది. అంతేకాకుండా వారితో మాట్లాడుతున్న భావన మనలో కలుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ టెక్నాలజీని మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తెస్తుందా? లేక దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందా అనే విషయం గురించి క్లారిటీ తెలియడం లేదు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ మాత్రం అందుబాటులోకి వస్తే ఎంతో మంది తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి కొంతవరకు ఊరటగా ఉంటుందని చెప్పవచ్చు.

డేటింగ్ యాప్స్ వాడుతున్నారా.. మీ కొంప కొల్లేరే..!

రోజురోజుకు టెక్నాలజీ వినియోగం ఎంత పెరుగుతోందో టెక్నాలజీని వినియోగించుకుని మోసాలు చేసే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అమాయకులను టార్గెట్ చేసి మోసగాళ్లు తెలివిగా వాళ్లను బురిడీ కొట్టిస్తున్నారు. డేటింగ్ యాప్స్ ద్వారా మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్ లైన్ డేటింగ్ పేరుతో కోట్ల రూపాయలు కాజేస్తున్న కేటుగాళ్లను అరెస్ట్ చేశారు.

డేటింగ్ సైట్లలో రిజిష్టర్ చేసుకున్న వాళ్లకు అమ్మాయిలతో ఫేక్ కాల్స్ చేయిస్తూ మోసగాళ్లు ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. బాధితులు మోసపోయామని తెలిసినా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే భయపడుతూ ఉండటంతో ఈ తరహా మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మోసపోయిన ఓ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా తీగ లాగే డొంకంతా కదిలింది.

ఇద్దరు వ్యక్తులు డేటింగ్ యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలను నియమించుకుని కాల్ సెంటర్ ను నిర్వహిస్తూ అమాయకులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కోల్ కతా కేంద్రం కాల్ సెంటర్ నిర్వహిస్తుండగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. 16 మంది అమ్మాయిలకు 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ప్రధాన నిందితులు బుద్ధ పాల్, ఆనంద్ కర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు వీరి నుంచి 51 సిమ్ కార్డులు, రెండు లాప్ ట్యాప్ లు, 24 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డేటింగ్ యాప్స్ ను ఉపయోగించే యువకులు ఇలాంటి మోసాలపై అవగాహన పెంచుకోవాలని.. ఆన్ లైన్ లో అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి నగదు జమ చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని పోలీసులు సూచిస్తున్నారు.