Tag Archives: Thieves

Bigg Boss6: దొంగలతో కలిసి పోలీసులను గెలిపిస్తానని శపథం చేసిన రేవంత్.. మరి గెలిపించారా?

Bigg Boss6: బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం మూడో వారం ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ఈ వారంలో భాగంగా కెప్టెన్సీ టెస్ట్ కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులను దొంగ పోలీసులుగా విడదీస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ టాస్క్ కొనసాగుతుండగా దొంగల టీంలో ఏమాత్రం యూనిటీ లేకపోవడంతో వాళ్ల మధ్య వాళ్లకే గొడవలు జరుగుతున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా గీతుతో రేవంత్ కుదుర్చుకున్న డీల్ పై అనుమానం వచ్చిన దొంగలు రేవంత్ దాచుకున్న బొమ్మలను వాళ్లే దొంగలిస్తారు.

ఈ విధంగా రేవంత్ బొమ్మలను దొంగతనం చేయడానికి శ్రీ సత్య కూడా సహాయం చేస్తుంది అయితే తాను దాచుకున్న బొమ్మలు దొంగలే దొంగతనం చేశారని తెలియడంతో రేవంత్ ఆశ్చర్యపోతాడు. ఇక ఈ విషయం తెలిసిన రేవంత్ ఎలాగైనా పోలీసులను గెలిపించాలని శపథం చేస్తాడు.

Bigg Boss6: నేను చాలా కన్నింగ్ అని ఒప్పుకున్న రేవంత్..

నిద్రపోదాం అనుకున్నాను కానీ నిద్ర పోను నేను వాళ్ళ కన్నా కన్నింగ్ ఇలా దాచుకున్న బొమ్మలను దొంగతనం చేయడానికి మినిమం కామన్ సెన్స్ ఉండాలి అంటూ ఈయన మండిపడ్డారు. అంతేకాకుండా రేవంత్ తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను పోలీసులకు ఇవ్వడానికి సిద్ధపడతారు. దీంతో సుదీప మాట్లాడుతూ నీ వరకు వచ్చేసరికి గేమ్ వచ్చిందా.నువ్వు టీ మొత్తాన్ని డిస్క్ క్వాలిఫై చేస్తావా అంటూ తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అయితే రేవంత్ మాత్రం తన అనుకున్నదే చేయాలని మొండి పట్టు పడ్డారు. ఈయన నిజంగానే దొంగల టీం తో కలిసి పోలీసులను గెలిపించారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఇంటి ముందు ఆగిన ఇద్దరు అమ్మాయిలు.. చివరకు ఏం చేశారో తెలుసా..?

అలంకరణ సామగ్రి అంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టం. అంతేకాకుండా అందులోనూ నగలు, పూలు, మేకప్ కిట్లు, డ్రెస్సులు అనేవి ఇంకా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వాటి కోసం వేలల్లో ఖర్చు అయినా వెనకాడకుండా కొనేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ ఇద్దరు అమ్మాయిలు దొంగలుగా మారారు. వాళ్లు చేసే దొంగతనం ఎంటో తెలిస్తే షాక్ అవుతారు.. వాళ్లు పూలకుండీలను దొంగతనం చేస్తున్నారు.
అవునండి.. మీరు విన్నది నిజమే.. వాళ్లు ఇంటి ముందు ఉంచే పూలకుండీలను మాత్రమే దొంగతనం చేస్తున్నారు. ఇది సీసీఫుటేజీలో చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని నగరి ప్యాలెస్ కాపౌండ్ లోని ఓ లాయర్ తన ఇంటి ఎదుట సీసీ ఫుటేజి చెక్ చేయగా ఇదంతా తెలిసింది. ఓ స్కూటీపై ఇద్దరు యువతులు వచ్చి ఇంటిముందు ఆగారు. రోడ్డుపై అటు నుంచి ఇటు నుంచి ఎవరైనా వస్తున్నారా.. అని చూశారు.

ఉన్నట్లుండి పూలకుండీని స్కూటీపై పెట్టుకున్నారు. ఓ నిమిషం తర్వాత ఆ పూలకుండీని తీసేసి.. అక్కడ పెట్టి మరో పూలకుండీని స్కూటీపై పెట్టుకొని అక్కడి నుంచి జారుకున్నారు. మొదట వారు తీసిన పూల కుండీ తులసి మొక్కది కాగా.. దానిని మళ్లీ అక్కడ పెట్టేసి కొత్తరకం పూలమొక్కను దొంగిలించినట్లు ఇంటి యజమాని తెలిపారు. మొక్కలు కావాలంటే నర్సరీలో చాలా ఉంటాయి.. అక్కడకు వెళ్లి కొనుక్కోవాలి లేదా.. ఇంటి దగ్గర ఉంటే దాని అంటును కత్తిరించి తెచ్చి నాటుకోవాలి.

కానీ ఇలా దొంగతనం చేయడం ఏంట్రా అని తెలిసిన వారు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పూలకుండీ మొక్కలకు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మనం ఒక మామిడి చెట్టుకు నలుగురు సెక్యూరిటీ గార్డులను కాపలాగా నియమించినట్లు చూశాం. ఇది మధ్యప్రదేశ్ లో జరిగింది. అలాగే.. పూలకుండీలకు కూడా గార్డులు నియమించాలా అంటూ పలువురు పేర్కొంటున్నారు.

మీ ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి!

సాధారణంగా మనం ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా ఏదో పనిలో నిమగ్నమై ఉండి మన ఫోన్ పోగొట్టుకోవడం సర్వసాధారణం. మరి కొన్ని సార్లు మన ఫోన్ దొంగలు కూడా దొంగలిస్తుంటారు. అయితే పోగొట్టుకున్న లేదా దొంగలు తీసుకెళ్లిన మన ఫోన్ ఎక్కడుందో? మనకి ఎంత దూరంలో ఉందో ఎంతో సులభంగా కనుక్కోవచ్చు. కేవలం ఫోన్ కనుక్కోవడం కాకుండా మన ఫోన్ లో ఉండే వాట్స్ యాప్ చాట్ ను కూడా తొలగించవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం..

మన ఫోన్ పోగొట్టుకున్న వెంటనే మొదటగా గూగుల్ ఓపెన్ చేసి అందులో  How To Find Mobile Location అనేది టైప్ చేయాలి. తర్వాత మన సెల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మన ఫోన్ ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ విధంగానే కాకుండా ఈ మెయిల్ ద్వారా కూడా పోగొట్టుకున్న మన ఫోను ఎక్కడుందో సులభంగా కనిపెట్టవచ్చు. దీనికోసం ముందుగా మనం మెయిల్ లాగిన్ కావాల్సి ఉంటుంది. మెయిల్ లో ఫైండ్ మై డివైస్ ఆప్షన్ ఆన్ చేయడం ద్వారా మన ఫోన్ ఎక్కడుందో తెలిసిపోతుంది.

మన సెల్ ఫోన్ లో ఎంతో విలువైన సమాచారం, మెసేజ్ లు ఉంటే వెంటనే వాటిని తొలగించుకొనే అవకాశం కూడా ఉంది.దీని కోసం నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసి, మీ వాట్సాప్ ఖాతాను ఎవరూ యాక్సెస్ చేయలేని విధంగా సిమ్ కార్డ్ లాక్ చేయాల్సి ఉంటుంది. ఇక వాట్సాప్ ఖాతాను డీ ఆక్టివేట్ చేయాలనుకుంటే కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది.

మెయిల్‌లో ప్రధానంగా “Lost/Stolen: Please Deactivate My Account అని ఇచ్చి మొబైల్ నంబర్ ను ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మన ఫోన్ దొరికిన లేదా కొత్త ఫోన్ కొన్న 30 రోజుల్లో మన సిమ్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పోగొట్టుకున్న మన ఫోను ఎంతో సులభంగా ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.