అలంకరణ సామగ్రి అంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టం. అంతేకాకుండా అందులోనూ నగలు, పూలు, మేకప్ కిట్లు, డ్రెస్సులు అనేవి ఇంకా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వాటి కోసం వేలల్లో ఖర్చు అయినా వెనకాడకుండా కొనేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ ఇద్దరు అమ్మాయిలు దొంగలుగా మారారు. వాళ్లు చేసే దొంగతనం ఎంటో తెలిస్తే షాక్ అవుతారు.. వాళ్లు పూలకుండీలను దొంగతనం చేస్తున్నారు.
అవునండి.. మీరు విన్నది నిజమే.. వాళ్లు ఇంటి ముందు ఉంచే పూలకుండీలను మాత్రమే దొంగతనం చేస్తున్నారు. ఇది సీసీఫుటేజీలో చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని నగరి ప్యాలెస్ కాపౌండ్ లోని ఓ లాయర్ తన ఇంటి ఎదుట సీసీ ఫుటేజి చెక్ చేయగా ఇదంతా తెలిసింది. ఓ స్కూటీపై ఇద్దరు యువతులు వచ్చి ఇంటిముందు ఆగారు. రోడ్డుపై అటు నుంచి ఇటు నుంచి ఎవరైనా వస్తున్నారా.. అని చూశారు.
ఉన్నట్లుండి పూలకుండీని స్కూటీపై పెట్టుకున్నారు. ఓ నిమిషం తర్వాత ఆ పూలకుండీని తీసేసి.. అక్కడ పెట్టి మరో పూలకుండీని స్కూటీపై పెట్టుకొని అక్కడి నుంచి జారుకున్నారు. మొదట వారు తీసిన పూల కుండీ తులసి మొక్కది కాగా.. దానిని మళ్లీ అక్కడ పెట్టేసి కొత్తరకం పూలమొక్కను దొంగిలించినట్లు ఇంటి యజమాని తెలిపారు. మొక్కలు కావాలంటే నర్సరీలో చాలా ఉంటాయి.. అక్కడకు వెళ్లి కొనుక్కోవాలి లేదా.. ఇంటి దగ్గర ఉంటే దాని అంటును కత్తిరించి తెచ్చి నాటుకోవాలి.
కానీ ఇలా దొంగతనం చేయడం ఏంట్రా అని తెలిసిన వారు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పూలకుండీ మొక్కలకు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మనం ఒక మామిడి చెట్టుకు నలుగురు సెక్యూరిటీ గార్డులను కాపలాగా నియమించినట్లు చూశాం. ఇది మధ్యప్రదేశ్ లో జరిగింది. అలాగే.. పూలకుండీలకు కూడా గార్డులు నియమించాలా అంటూ పలువురు పేర్కొంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…