Featured

చిన్నప్పుడే మహేష్ బాబు డూప్ లేకుండా పై నుంచి దూకాడని మీకు తెలుసా ?

సినిమా ఇండస్ట్రీ లోకి నటనను వారసత్వంగా తీసుకొని అడుగుపెట్టిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరని చెప్పవచ్చు.బాల నటుడిగా తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. మహేష్ బాబు తన చిన్నతనంలోనే నటనను ఎంతో సీరియస్ గా తీసుకోవడంతో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు.

సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో ఎంతో కష్టతరమైన సన్నివేశాలను తెరకెక్కించేటప్పుడు హీరోల స్థానంలో డూప్ లను పెట్టి ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. అయితే మహేష్ బాబు తన చిన్నతనంలోనే డూప్ లేకుండా పలు స్టంట్ లో నటించారు. తన తండ్రి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న అటువంటి “శంఖారావం” సినిమాలో మహేష్ బాబు ఓ పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అచ్చం మహేష్ బాబు డ్రెస్ మాదిరిగానే మరొక కుర్రాడు డ్రెస్ ధరించి ఉన్నాడు. అతనిని చూసిన మహేష్ నాలాంటి డ్రెస్ వేశారని అసిస్టెంట్ డైరెక్టర్ ని అడిగారు.

అందుకు డైరెక్టర్ సినిమాలో పై నుంచి కిందకు దూకే సన్నివేశం ఉంది. అందులో నటించడానికి నీకి డూప్ గా ఆ కుర్రాడిని తీసుకున్నామని చెప్పగా.. అది విన్న మహేష్ బాబు ఈ మాత్రం దానికి డూప్ ఎందుకు నేనే చేస్తా అంటూ.. కెమెరా లేకపోయినా వెంటనే గోడ పై నుంచి కిందకు దూకారు. ఈ క్రమంలోనే ఆ సినిమాలో తనకు డూప్ అవసరం లేదని, తానే స్వయంగా ఆ సన్నివేశంలో పాల్గొన్నారు.

కేవలం ఈ సినిమాలో మాత్రమే కాకుండా”కొడుకు దిద్దిన కాపురం” అనే సినిమాలో ఒక బైక్ స్టంట్ చేయాల్సి ఉంది. అందుకోసం కూడా ఒక డూప్ ను పెట్టారు. అయితే సెట్ లో తనతండ్రి ఉంటే తనని ఆ స్టంట్ చేయనివ్వరని చెప్పి తన తండ్రి లంచ్ కి వెళ్ళిన సమయంలో స్టంట్ మాస్టర్ ని పిలిచి తనని ఒప్పించి సన్నివేశంలో డూప్ లేకుండా మహేష్ బాబు నటించారు.

అలాగే బాలచందర్ సినిమాలో కూడా మహేష్ బాబు డూప్ లేకుండా నటిస్తున్న సమయంలో ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నటువంటి శరత్ కుమార్ కూడా డూప్ లేకుండా నటిస్తానని పట్టుబడ్డాడు. ఈ క్రమంలోనే చిత్రబృందం అందుకు ఒప్పుకోవడంతో డూప్ లేకుండా నటించడం వల్ల శరత్ కుమార్ షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురై కొద్దిగా ఫ్యాక్చర్ అయ్యింది. ఈ విధంగా ప్రమాదం జరిగినప్పటికీ వీరు మాత్రం డూప్ లేకుండా నటించడం మానలేదని చెప్పవచ్చు.


lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago