Tag Archives: tokyo olympics

పీవీ సింధుకు ఐస్ క్రీమ్ ఆఫర్ చేసిన మోడీ.. రాకెట్ గిఫ్ట్ గా ఇచ్చిన సింధు!

ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలలో భారత క్రీడాకారులు వివిధ క్రీడలలో ఏడు పథకాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ లో కాంస్య పతకాన్ని సంపాదించుకున్న పివి సింధు ఒలంపిక్ క్రీడలలో రెండు పథకాలను సాధించిన క్రీడాకారిణిగా రికార్డును సొంతం చేసుకుంది.తాజాగా జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సంపాదించుకున్న పీవీ సింధుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

తాజాగా భారతదేశానికి ఒలంపిక్ క్రీడలలో పథకాలు తీసుకువచ్చిన క్రీడాకారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గౌరవ సత్కారాలను చేశారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు అందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

ఈ క్రమంలోనే పీవీ సింధుతో మాట్లాడుతూ తనకు ముందుగా ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయబోతున్నట్లు తెలిపారు.ఒలంపిక్ క్రీడలలో భాగంగా గత కొంత కాలం నుంచి పీవీ సింధు ఐస్ క్రీమ్ తినకుండా ఉండటం వల్ల కాంస్య పతకాన్ని గెలిచిందని ఈ క్రమంలోనే తనకు ఒక ఐస్ క్రీమ్ ఆఫర్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విషయాన్ని పీవీ సింధు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ దగ్గ రనుంచి అరుదైన గౌరవ సత్కారం లభించిందని తెలియజేశారు.

అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పీవీ సింధు చిన్న బహుమతిని అందజేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన బ్యాడ్మింటన్ రాకెట్ ఇచ్చినట్లు పీవీ సింధు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం పీవీ సింధు ఒలంపిక్స్ లో ఆడినటువంటి బ్యాడ్మింటన్ బ్యాట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఆ స్వర్ణం వెనుక ఎన్నో అవమానాలు.. వాటిని భరిస్తూ బంగారు పతకం వైపు పరుగు పెట్టాడు ‘నీరజ్ చోప్రా’..

విజయం సాధించిన ప్రతి సాధకుడి వెనుక ఏదో చిన్న పాటి కష్టం దాగి ఉంటుంది. ఇలాంటిదే భారతదేశం గర్వంగా చెప్పుకునే విధంగా టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics) భారత అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్వర్ణం (Gold Medal) సాధించాడు. దీంతో భారత్ లో ఏ రాష్ర్టంలో చూసినా ఆనందోత్సవాల మధ్య ప్రజలు సంబురాలు చేసుకున్నారు. అయితే ఇంత విజయం సాధించి భారత్ కు స్వర్ణం సాధించి ఆ ‘బంగారు’ చోప్రా ఒకప్పుడు ఇలా.. కండలు తిరిగి ఓ బాలివుడ్ హీరోలా ఉండేవాడు కాదు.

తోటి స్నేహితులు తన రూపాన్ని చూసి ఆటపట్టించేవారంట. అతడు 10 ఏళ్ల వయస్సులో ఎంతో ఉబకాయంతో బాధపడేవాడంట. వయస్సుకు మించిన వయస్సు ఉంటే ఎవరికైనా చూడటానికి మంచిగా అనిపించదు. ఇలా లావు ఎక్కువగా ఉండటంతో స్నేహితులు, బంధువుల వద్ద మాటలు పడ్డాడు. ఏదైనా ఒక రోజు కుర్తా-పైజామా వేసుకొని వెళ్తే.. అరెవో సర్పంచ్… అని ఆట పట్టించే వాళ్లు. సర్పంచ్ అంటే ముసలోడా అని వ్యంగ్యంగా అన్నట్లు అన్నమాట. ఇలా ఎన్నో అవమానాలు భరించేవాడు.
ఇలాంటి అవమానాలే అతడికి కసిని పెంచాయి. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు.

పానిపట్‌కు సమీపంలోని ఖాంద్ర అనే గ్రామంలో నీరజ్ కుటుంబం నివసించేది. బరువు తగ్గించేందుకు వాళ్ల తల్లిదండ్రులు పానిపట్ స్టేడియంకు తీసుకొని వచ్చి పరుగెత్తించేవారు. నీరజ్ అక్కడ ట్రాక్‌పై పరుగులు పెడుతూనే.. జావెలిన్ త్రో చేసే వాళ్లను చూశాడు. ఈటెను కసిగా దూరంగా విసరడం అతడికి ఎందుకో నచ్చింది. అలా తొలి సారి జావెలిన్ పట్టుకున్న నీరజ్.. దాన్నే లోకంగా చేసుకున్నాడు. ఇలా బరువును తగ్గించుకోవడానికి వెళ్లిన చోప్రా.. అథ్లెట్‌గా మారిపోయాడు. ఇలా శిక్షణ తీసుకొని చిన్న చిన్న లెవల్లో ఆడి పతకాలను నెగ్గాడు.

2015 సంవత్సరంలోనే అతడు 80 మీటర్లు మార్కును దాటాడు. ఇంకా ఎక్కువ దూరం విసరాలనే మెరగైన శిక్షణ కోసం జర్మనీ వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత అతని ఆటలో ఎంతో మార్పు వచ్చింది. దీని ఫలితంగానే 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో ఏకంగా స్వర్ణ పతకం గెలిచాడు. ఇలా అతడు విసిరే టక్నిక్ చూసి కోచ్ లు కూడా ఒలంపిక్స్ లో పతకం ఖాయం అని అనే వారు. ఇలా అతడు పతకాలు సాధిస్తున్న క్రమంలో కూడా సర్పంచ్ అని ఊరి వాళ్లు అనే వారు. కానీ ఈ సారి గౌరవంగా పిలిచేవాళ్లు. ఇలా ఎగతాలి చేసిన వాళ్లే ఇప్పుడు అతడిని ఎత్తుకొని అభినందిస్తున్నారు.

కలవరపెడుతున్న కరోనా కేసులు.. వైరస్ బారిన పడుతున్న టోక్యో ఒలంపిక్ క్రీడాకారులు..!

టోక్యో ఒలంపిక్స్ 2020 లో జరగాల్సింది. అయితే కరోనా కారణంగా వాయిదాపడి 2021లో జరుగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి నిర్వాహకులు.. ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. టోక్యో సిటీలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎప్పుడూ లేనంతగా కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇప్పటికే వేర్వేరు దేశాలకు చెందిన కొంతమంది క్రీడాకారులు కరోనా బారిన పడి.. పోటీ నుంచి తప్పుకున్నారు. టోక్యో హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించిన హెల్త్ బులెటిన్ లో గత 24 గంటల్లో టోక్యోలో కొత్తగా 3,865 కేసులు నమోదయినట్లు వెల్లడించారు. టోక్యోలో ఇదే అత్యధికం. దీంతో టోక్యో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. గత మూడురోజులుగా వరసగా మంగళ, బుధ, గురు వారాల్లో 9,890 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికార యంత్రాంగం తెలిపింది.

రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్‌ అయిన కెండ్రిక్స్‌, కరోనా బారిన పడడంలో టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. అయితే అతనితో కాంటాక్ట్ ఉన్న ఆస్ట్రేలియా అథ్లెట్ల టీమ్ మొత్తం ఐసోలేషన్‌కి వెళ్లాల్సి వచ్చింది. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే విశ్వక్రీడల్లో పాల్గొంటారా? లేదా? అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఒలింపిక్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అథ్లెట్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జూలై 23న మొదలైన విశ్వక్రీడలు.. ఆగస్టు 8 వరకూ జరగనున్నాయి.

అయితే ఈ రేంజ్‌లో కేసులు పెరుగుతూ పోతే, విశ్వక్రీడలను అర్ధాంతరంగా నిలిపివేసే అవకాశమూ ఉంది. మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లోకి ఎవ్వరినీ ప్రవేశించనివ్వట్లేదు. ఎందుకంటే అక్కడ కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. టోక్యోలో 25 శాతం మేర కొత్త కేసులు నమోదైన ప్రతి ప్రాంతంలోనూ ఎమర్జెన్సీ విధించారు. కమిటీ అధికారికంగా నియమించుకున్న వాలంటీర్ల సంఖ్యను కూడా పరిమితం చేశారు అధికారులు. అంతే కాకుండా ఆసుపత్రిలో బెడ్ల సంఖ్య కూడా పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.

మేము బీర్లు ఎలా అమ్ముకోవాలి.. ముందు అనుమతి ఇవ్వండంటూ వారికీ డిమాండ్?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వివిధ వేరియంట్ల రూపంలో కోరలు చాపుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. తాజాగా గత ఏడాది జరగవలసిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అయితే ఒలంపిక్స్ జరుగుతాయా లేదా అన్న సందిగ్ధంలో నిర్వాహకుల నుంచి అథ్లెట్ల వరకు అందరూ ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈవెంట్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తోన్న ఓ కంపెనీ మాత్రం ఒక విచిత్రమైన సమస్యతో తీవ్ర ఆందోళన చెందుతుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఒలంపిక్స్ నిర్వహించకూడదని కొందరు డిమాండ్ చేయగా మరికొన్ని, ఒకవేళ ఒలంపిక్స్ నిర్వహించిన కూడా ప్రేక్షకులను మాత్రం అనుమతించ వద్దని పలు ఎన్జీవోలు జపాన్ ప్రభుత్వం, నిర్వాహక కమిటీని కోరుతున్నాయి. ఈ క్రమంలోనే టోక్యో ఒలంపిక్స్ స్పాన్సర్ లో ఒకరైన  ‘అషాహి బ్రూవరీస్’ (Asahi Breweries) సంస్థ మరో డిమాండ్ చేస్తోంది.

టోక్యో ఒలంపిక్స్ పూర్తి ప్రేక్షకులకు అనుమతి నిర్వహించాలి లేకపోతే పూర్తిగా వాయిదా వేయాలని తన అభిప్రాయాన్ని తెలిపింది. జపాన్ లో వివిధ రకాల బీర్ లను,వైన్, నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ అమ్మే హక్కులు అన్నీ అషాహీ బ్రూవరీస్ వద్దనే ఉన్నాయి. ఈ క్రమంలోనే
అషాహీ ఒలంపిక్స్ కి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. ఒలింపిక్స్ కోసం వివిధ దేశాల నుంచి లక్షలాది మంది ప్రేక్షకులు అక్కడికి తరలిరావడంతో వారి బీర్ల అమ్మకాలు పుంజుకుంటాయన్న భావనతోనే ఒలింపిక్స్ కి స్పాన్సర్ చేసినట్లు తెలిపారు.

అషాహీ తమ పేర్లను స్టేడియంలో కూడా అందుబాటులో ఉంచడానికి అనుమతులను దక్కించుకుంది.ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఒలంపిక్స్ నిర్వహిస్తే తమ వ్యాపారం పూర్తిస్థాయిలో దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒలంపిక్స్ నిర్వహిస్తే పూర్తిస్థాయి ప్రేక్షకులతో నిర్వహించాలి లేకపోతే ముందుగానే ఒలంపిక్స్ నుంచి స్పాన్సర్ గా తప్పుకుంటామని హెచ్చరిస్తోంది.