Tag Archives: tollywood

వంద రూపాయల కోసం ఎన్నో కష్టాలను చూశాను: హీరో రాజా

సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారికి అదృష్టం అయినా ఉండాలి, సినీ బ్యాక్ గ్రౌండ్ అయినా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వస్తుంటాయి.ఇలాంటి తరుణంలోనే సినిమాల్లో నటించాలని ఎంతో ఆశ ఉన్నప్పటికీ ఇండస్ట్రీ చుట్టూ అవకాశాల కోసం తిరుగుతూ అవకాశాన్ని దక్కించుకున్న హీరోలలో రాజా ఒకరు.అయితే ఈ అవకాశాన్ని ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయారు. “ఓ చిన్నదాన” సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రాజా”ఆనంద్” సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు.తర్వాత కొంత కాలానికి అవకాశాలు లేక పూర్తిగా ఇండస్ట్రీకి స్వస్తి పలికాడు.

చాలా కాలంగా ప్రేక్షకులు దూరమైనా రాజాను ప్రస్తుతం అలీ నిర్వహిస్తున్న “ఆలీతో సరదాగా”అనే షో కి వచ్చారు. ఈనెల 14న ప్రసారం కానున్న ఈ షో లో భాగంగా ఇప్పటికే ప్రోమో విడుదల అయింది.ఈ ప్రమోలో రాజా తను ఇండస్ట్రీలోకి రాకముందు పడిన అవమానాలను, తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు కొంతమంది ఎన్నో రకాలుగా అవమానించారని ఈ షో ద్వారా తెలిపాడు.

తన వ్యక్తిగత విషయాలను తెలుపుతూ కేవలం ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మను కోల్పోయానని, 14 సంవత్సరాలలో అనారోగ్యంతో తండ్రిని కూడా దూరం చేసుకున్నానని తెలిపారు.అమ్మ అంటే ఎలా ఉంటుందో తెలియని రాజా తన అక్కల సమక్షంలోనే పెరిగి పెద్ద అయ్యాడు.సినిమాలలోకి రాకముందు ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేసే వాడిని, అప్పట్లో వంద రూపాయల కోసం ఎంతో కష్టపడ్డానని ఈ సందర్భంగా తెలిపారు.

ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఇండస్ట్రీలో చేసే రాజకీయాలను ఎదుర్కోలేక పోయాడు. అతను నటించిన సినిమాలకు థియేటర్లు కూడా దొరికేవి కావని, వారిని ఎదిరించలేక సినిమాలకు స్వస్తి చెప్పి ప్రస్తుతం పాస్టర్ గా స్థిరపడ్డానని, ఈ షో ద్వారా తాను అనుభవించిన కష్టాలను ప్రేక్షకులకు తెలిపారు.

సమంత టాక్ షోలో సందడి చేసిన మెగాస్టార్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన అక్కినేని సమంత “ఆహా” అనే యాప్ ద్వారా “సామ్ జామ్”అనే టాక్ షో కి వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆహా అనే యాప్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్వహించగా, ఈ యాప్ లో “సామ్ జామ్” అనే టాక్ షో ద్వారా ప్రముఖ సెలబ్రిటీస్ వారి వ్యక్తిగత విషయాల గురించి సమంత ఇంటర్వ్యూ చేసి వారి సమాధానాలను ఈ షో ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటారు.

ఇప్పటికే ఈ యాప్ ద్వారా “సామ్ జామ్”నవంబర్ 13న మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. ఫస్ట్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ ఎంట్రీ అవడంతో ఈ షో ప్రారంభమైంది. అయితే ఈ యాప్ కు ఎక్కువమంది సబ్స్క్రైబర్లలను పెంచుకునే ప్రయత్నంలో ఈ షో ను సమంతతో నిర్వహిస్తున్నారు. ఈ షోలో భాగంగా ప్రముఖ సెలబ్రిటీస్ ను ఈ షో కి ఆహ్వానించి వారిని సమంత ఇంటర్వ్యూ చేస్తారు. తర్వాత వచ్చే ఎపిసోడ్ లలో తమన్నా, రష్మిక, అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీస్ ఈ షోలో పాల్గొని సందడి చేయనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సామ్ జామ్ షో లో సందడి చేయనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే అనుకున్నట్లుగానే మెగాస్టార్ చిరంజీవి షోలో పాల్గొన్నారు. దీనికిసంబంధించిన కొన్ని ఫోటోలను ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఎపిసోడ్ త్వరలోనే ఆహా ద్వారా ప్రసారం కానుంది. సమంత అడిగే ప్రశ్నలకు మెగాస్టార్ ఎలాంటి సమాధానాలు చెబుతారో అని ప్రేక్షకాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.