Featured

సమంత టాక్ షోలో సందడి చేసిన మెగాస్టార్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన అక్కినేని సమంత “ఆహా” అనే యాప్ ద్వారా “సామ్ జామ్”అనే టాక్ షో కి వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆహా అనే యాప్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్వహించగా, ఈ యాప్ లో “సామ్ జామ్” అనే టాక్ షో ద్వారా ప్రముఖ సెలబ్రిటీస్ వారి వ్యక్తిగత విషయాల గురించి సమంత ఇంటర్వ్యూ చేసి వారి సమాధానాలను ఈ షో ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటారు.

ఇప్పటికే ఈ యాప్ ద్వారా “సామ్ జామ్”నవంబర్ 13న మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. ఫస్ట్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ ఎంట్రీ అవడంతో ఈ షో ప్రారంభమైంది. అయితే ఈ యాప్ కు ఎక్కువమంది సబ్స్క్రైబర్లలను పెంచుకునే ప్రయత్నంలో ఈ షో ను సమంతతో నిర్వహిస్తున్నారు. ఈ షోలో భాగంగా ప్రముఖ సెలబ్రిటీస్ ను ఈ షో కి ఆహ్వానించి వారిని సమంత ఇంటర్వ్యూ చేస్తారు. తర్వాత వచ్చే ఎపిసోడ్ లలో తమన్నా, రష్మిక, అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీస్ ఈ షోలో పాల్గొని సందడి చేయనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సామ్ జామ్ షో లో సందడి చేయనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే అనుకున్నట్లుగానే మెగాస్టార్ చిరంజీవి షోలో పాల్గొన్నారు. దీనికిసంబంధించిన కొన్ని ఫోటోలను ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఎపిసోడ్ త్వరలోనే ఆహా ద్వారా ప్రసారం కానుంది. సమంత అడిగే ప్రశ్నలకు మెగాస్టార్ ఎలాంటి సమాధానాలు చెబుతారో అని ప్రేక్షకాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఇలా కూర్చుంటే రక్తపోటు పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్!

ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…

9 minutes ago

దేవుడికి నమస్కారం చేస్తే ఎందుకు కళ్లు మూసుకుంటాం? అసలు కారణం ఇదే!

దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…

39 minutes ago

తెలంగాణలో ఎవరి జనాభా ఎక్కువ?.. కుటుంబ సర్వేలో బిగ్ రివీల్

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…

60 minutes ago

అమావాస్య వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుంటే ఆశ్చర్యమే!

ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…

1 hour ago

అంతర్జాతీయ విజయాల కోసం తిరుమల చేరుకున్న పీవీ సింధు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…

2 hours ago

ఎవరీ నటాలీ బేకర్?.. అమెరికా-ఇరాన్ చర్చలతో ట్రెండ్‌లోకి

ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…

2 hours ago