తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన అక్కినేని సమంత “ఆహా” అనే యాప్ ద్వారా “సామ్ జామ్”అనే టాక్ షో కి వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆహా అనే యాప్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్వహించగా, ఈ యాప్ లో “సామ్ జామ్” అనే టాక్ షో ద్వారా ప్రముఖ సెలబ్రిటీస్ వారి వ్యక్తిగత విషయాల గురించి సమంత ఇంటర్వ్యూ చేసి వారి సమాధానాలను ఈ షో ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటారు.

ఇప్పటికే ఈ యాప్ ద్వారా “సామ్ జామ్”నవంబర్ 13న మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. ఫస్ట్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ ఎంట్రీ అవడంతో ఈ షో ప్రారంభమైంది. అయితే ఈ యాప్ కు ఎక్కువమంది సబ్స్క్రైబర్లలను పెంచుకునే ప్రయత్నంలో ఈ షో ను సమంతతో నిర్వహిస్తున్నారు. ఈ షోలో భాగంగా ప్రముఖ సెలబ్రిటీస్ ను ఈ షో కి ఆహ్వానించి వారిని సమంత ఇంటర్వ్యూ చేస్తారు. తర్వాత వచ్చే ఎపిసోడ్ లలో తమన్నా, రష్మిక, అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీస్ ఈ షోలో పాల్గొని సందడి చేయనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సామ్ జామ్ షో లో సందడి చేయనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే అనుకున్నట్లుగానే మెగాస్టార్ చిరంజీవి షోలో పాల్గొన్నారు. దీనికిసంబంధించిన కొన్ని ఫోటోలను ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఎపిసోడ్ త్వరలోనే ఆహా ద్వారా ప్రసారం కానుంది. సమంత అడిగే ప్రశ్నలకు మెగాస్టార్ ఎలాంటి సమాధానాలు చెబుతారో అని ప్రేక్షకాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here