Tag Archives: tomorrow

Night Curfew: ఒమిక్రాన్ ఎఫెక్ట్..రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ..!

Night Curfew: కరోనా తగ్గినట్లే తగ్గి.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీంతో దేశంలోని కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం నైట్ కర్ఫ్యూని విధిస్తున్నాయి.

Night Curfew: ఒమిక్రాన్ ఎఫెక్ట్..రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ..!

దీనిలో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 10 నుంచి రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల నైట్ కర్ఫ్యూని విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమూహాలుగా ఉంటే.. వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఉదయం వేళ 144 సెక్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Night Curfew: ఒమిక్రాన్ ఎఫెక్ట్..రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ..!

స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, స్పాలు, బ్యూటీ సెలూన్‌లు, జూలు, మ్యూజియంలు , ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు మూసివేయబడతాయని పేర్కొన్నారు. హెయిర్ కటింగ్ సెలూన్‌లు , షాపింగ్ మాల్స్ , మార్కెట్ కాంప్లెక్స్‌లు 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఇంటి నుండి పనిని ఎంచుకోవాలని..

పార్కుల్లో సందర్శకుల సమాచారం కచ్చితంగా నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఇక రాష్ట్రంలో కొన్ని మినహాయింపులతో పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఫిబ్రవరి 15 వరకు మూసివేయబడతాయని పేర్కొన్నారు. ఇక ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఆడిటోరియం వంటి వాటిని నడిపించుకోవచ్చని తెలిపారు. డబుల్ డోస్ తీసుకున్న వారిని మాత్రమే వాటిల్లోకి అనుమతించనున్నట్లు చెప్పింది. వ్యాక్సినేషన్ తీసుకున్న వారు మాత్రమే వారిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మాత్రమే అనుమతించనున్నారు. ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 41,434 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా.. 9,671 రికవరీలు, 13 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 173,228 ఉండగా.. ఓమిక్రాన్ సంఖ్య 1,009కి పెరిగింది. ఇక ప్రభుత్వ కార్యాలయాలు ఇంటి నుండి పనిని ఎంచుకోవాలని .. ఆఫీసులో పని చేసే అవసరం ఉంటేనే డ్యూటీకి వెళ్లాలని పేర్కొన్నారు.

మా సభ్యులకు శుభవార్త చెప్పబోతున్న నూతన అధ్యక్షుడు.. అదేమిటంటే?

ఎన్నో విమర్శలు అనంతరం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవిని మంచు విష్ణు దక్కించుకున్నారు. ఈ ఎన్నికలలో భాగంగా ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. ఇలా ప్రకాష్ రాజ్ ప్యానల్ పై మంచు విష్ణు అధిక మెజారిటీతో గెలిచి మా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే మా అధ్యక్ష పదవికి పోటీ చేసిన సమయంలోనే మా భవనాన్ని తన సొంత డబ్బులతో నిర్మిస్తానని చెప్పిన మంచు విష్ణు పలు ప్రాంతాలలో భవనాన్ని నిర్మించడం కోసం స్థలాన్ని కూడా వెతికే పనిలో పడ్డారు. అయితే మూడు నెలల్లోగా భవనం గురించి క్లారిటీ ఇస్తానని చెప్పిన మంచు విష్ణు తాజాగా మా సభ్యులకు శుభవార్త అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే ఆ శుభవార్త ఏంటి అనేది మాత్రం 22 వ తేదీ అనగా రేపు వెల్లడించనున్నట్లు తెలిపారు. నూతన అధ్యక్షుడిగా ప్రమాణ ఉత్సవం స్వీకారం అనంతరం మొట్టమొదటిసారిగా మంచు విష్ణు మా సభ్యులకు శుభవార్తను తెలియజేయనున్నారు. అయితే ఏ విధమైనటువంటి శుభవార్త తెలియజేయనున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.

మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్,విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య ఎన్నో విమర్శలు జరిగిన అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన సభ్యులందరూ ఆ తర్వాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా మా ఎన్నికల గొడవ ముగిసిన తర్వాత మొట్టమొదటిసారిగా విష్ణు శుభవార్తను తెలియజేస్తున్నానని హింట్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.

వీధివ్యాపారులకు కేంద్రం శుభవార్త.. రేపే రూ.10,000 పంపిణీ..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వీధివ్యాపారులకు శుభవార్త చెప్పింది. ఆత్మ నిర్భర భారత యోజన స్కీమ్ కింద వీధివ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపటినుంచి కేంద్రం వీధివ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున రుణాలను అందించనుంది. ప్రధాని మోదీ దాదాపు ముడు లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందిన వారితో మోదీ నేరుగా మాట్లాడనున్నారు

కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలోని వీధివ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి విదితమే. లాక్ డౌన్ వల్ల లక్షల సంఖలో వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. అన్ లాక్ సడలింపులు అమలు చేసిన సమయంలో సైతం వీధివ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చాలామంది వీధివ్యాపారులు దిక్కుతోచని పరిస్థితుల్లో అప్పులపై ఆధాపడ్డారు. కేంద్రం వీధి వ్యాపారుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన్‌ మంత్రి స్ట్రీట్ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి యోజన స్కీమ్ ను ప్రవేశపెట్టింది.

పీఎం నరేంద్ర మోదీ జూన్ నెల 1వ తేదీన ఈ స్కీమ్ ను ప్రకటించారు. కేంద్రం ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ రేటులో రూ.10,000 మూలధనాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ కొరకు 24 లక్షల మంది వీధివ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మందికి రుణాలు ఇవ్వనుందని తెలుస్తోంది.

5.35 లక్షల మందికి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని.. మిగిలిన వీధివ్యాపారులకు రుణాలు మంజూరు చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే యూపీ నుంచి ఈ స్కీమ్ కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. 5,57,000 మంది ఉత్తరప్రదేశ్ వీధివ్యాపారులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. పీఎం తమకు ప్రయోజనం చేకూరేలా స్కీమ్ ను అమలు చేస్తూ ఉండటంపై వీధివ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.