Tag Archives: twice a week

వారానికి రెండు సార్లు చేపలు తింటే ఈ సమస్యను దూరం పెట్టవచ్చు..?

సాధారణంగా మన ఆరోగ్యానికి చేపలు ఎంతో మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే.చేపలు ఎన్నో పోషక పదార్థాలు ఉండటం వల్ల చేపలను తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి కనుక చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. అయితే తాజా అధ్యయనాల ప్రకారం వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వెల్లడైంది.

ముఖ్యంగా వారంలో రెండు సార్లు చేపలు తినటం వల్ల మెదడుకు సంబంధించిన వ్యాధులను దూరం పెట్టవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. సెరెబ్రోవాస్కులర్ డిసీజ్ ఇది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలను మూసివేసి మెదడు రక్త ప్రసరణ వ్యవస్థ కు ఆటంకం కలిగిస్తుంది. దీంతో మెదడులో స్ట్రోక్స్ రావడం లేదా అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది.

అయితే ఈ విధమైనటువంటి సమస్యను దూరం చేసుకోవడానికి వారానికి తప్పనిసరిగా రెండుసార్లు చేపలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.చేపలలో ఉండే ఒమేగా 3 పాలీఅన్‏శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ సెరెబ్రోవాస్కులర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదేవిధంగా మెదడులో ఏ విధమైనటువంటి స్ట్రోక్ రాకుండా కాపాడటమే కాకుండా అధిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

కేవలం మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఏ కాకుండా ఇతర అనారోగ్య సమస్యలను కూడా దూరం చేయడంలో చేపలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి కనుక చేపలను తరచూ తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని ఫ్రాన్స్ లోని బోర్డోక్స్ యూనివర్సిటీలో సీనియర్ పరిశోధకురాలు..డాక్టర్ సిసిలియా సమీరీ వెల్లడించారు.