సాధారణంగా మన ఆరోగ్యానికి చేపలు ఎంతో మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే.చేపలు ఎన్నో పోషక పదార్థాలు ఉండటం వల్ల చేపలను తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి కనుక చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. అయితే తాజా అధ్యయనాల ప్రకారం వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వెల్లడైంది.
ముఖ్యంగా వారంలో రెండు సార్లు చేపలు తినటం వల్ల మెదడుకు సంబంధించిన వ్యాధులను దూరం పెట్టవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. సెరెబ్రోవాస్కులర్ డిసీజ్ ఇది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలను మూసివేసి మెదడు రక్త ప్రసరణ వ్యవస్థ కు ఆటంకం కలిగిస్తుంది. దీంతో మెదడులో స్ట్రోక్స్ రావడం లేదా అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది.
అయితే ఈ విధమైనటువంటి సమస్యను దూరం చేసుకోవడానికి వారానికి తప్పనిసరిగా రెండుసార్లు చేపలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.చేపలలో ఉండే ఒమేగా 3 పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ సెరెబ్రోవాస్కులర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదేవిధంగా మెదడులో ఏ విధమైనటువంటి స్ట్రోక్ రాకుండా కాపాడటమే కాకుండా అధిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
కేవలం మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఏ కాకుండా ఇతర అనారోగ్య సమస్యలను కూడా దూరం చేయడంలో చేపలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి కనుక చేపలను తరచూ తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని ఫ్రాన్స్ లోని బోర్డోక్స్ యూనివర్సిటీలో సీనియర్ పరిశోధకురాలు..డాక్టర్ సిసిలియా సమీరీ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…