Featured

ఆ సమయంలో రెంట్ కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కావు..! విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

విజయ్ దేవరకొండ పరిచయం అక్కర్లేని పేరు. తన సొంత ట్యాలెంట్ ను నమ్ముకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అతడితో పాటు తన సోదరడు ఆనంద్ దేవరకొండను ప్రోత్సహిస్తున్నాడు ఈ యువహీరో. అయితే ఇటీవల అతడు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తాను కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నానని.. ఏ నిర్మాత ముందుకు రాకపోవడతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు.

ఈ ఇబ్బందులు మరొకరు పడకూడదనే ఉద్దేశ్యంతో సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశానని అన్నారు. ఇంట్లో పేరెంట్స్ రెంట్ కట్టడానికి ఇబ్బంది ఎదుర్కొన్నా తనకు బైక్ పెట్రోల్ కు డబ్బులు ఇచ్చి ఆడిషన్ కు పంపించేవారన్నారు. విశాఖ పట్నంలో ఆనంద్ దేవరకొండ హీరోగా.. విజయ్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘పుష్పక విమానం’.

ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల వైజాగ్ లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్మాతగా ముందడుగేశా. నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టమైన పని. ఒక్కోసారి ఇది అవసరమా అనిపిస్తుంటుంది అని యువ నటుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. నటుడిగా సినిమా కథలను ఎంపిక చేసుకోవడం.. పాత్రల కోసం శిక్షణ తీసుకోవడం లాంటివే సరిపోతున్నాయి.. ఇక సొంత చేతులపై ఇంకో సినిమా నిర్మించి ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం అంత సులువైన పని కాదంటూ చెప్పుకొచ్చాడు.

ఆత్మవిశ్వాసం, మీరు నాపై పెట్టిన నమ్మకంతో ముందుకెళ్తానన్నాడు. సినిమా చాలా బాగా వచ్చిందని.. ఆనంద్ దీనిలో అద్బుతంగా నటించాడన్నారు. ఈ మూవీ నవంబర్‌ 12న థియేటర్లోకి రానుంది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం’.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…

1 hour ago

పాస్ చేయండి సార్ అంటూ బోర్డుకు కాల్.. విశాఖలో విద్యార్థి వింత ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…

1 hour ago

కూతురి ప్రాణం తీశిన తండ్రి.. భువనగిరిలో దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…

2 hours ago

గురువారం పూజతో అదృష్టం మారుతుందా? కాశీలో అరుదైన బృహస్పతి ఆలయం.. గురు దోషాలకు ప్రత్యేక పరిష్కారం!

భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…

2 hours ago

రూ.10 కోట్ల స్కామ్ ఆరోపణలు.. మంగ్లీపై వివాదం మరింత ముదురు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…

2 hours ago

‘మహిళ గౌరవమే దేశ గౌరవం’.. బిల్లుల ముందు మోదీ ట్వీట్ వైరల్

పార్లమెంట్‌లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…

2 hours ago