సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు. ఇలా మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయమైన గంగవ్వ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో పల్లెటూరి వీడియోలను తీస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గంగవ్వ నేడు ఒక సెలబ్రిటీగా మారిపోయింది.
ఈమెకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లోకి అడుగుపెట్టింది.ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున గంగవ్వకు ఇంటిని కట్టిస్తానని మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటి కలను నెరవేర్చుకునే గంగవ్వ గృహ ప్రవేశం చేసింది.
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా 11 లక్షల రూపాయలను గెలుచుకున్న గంగవ్వకి నాగార్జున మరో 7 లక్షల సహాయం చేశారు. గంగవ్వ మరో మూడు లక్షల దాకా అప్పులు చేసి తాను కలలు కన్నా సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది.ఈ క్రమంలోనే గంగవ్వ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక గంగవ్వ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొన్న అఖిల్ సార్థక్,శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్ షో టీం సభ్యులు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు గంగవ్వకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…