బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్ళిన మోడల్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో టాస్క్ లో పాల్గొంటూ మంచి ఆదరణ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే జెస్సీ సిరి, షన్నుతో కలిసి ఎంతో స్నేహ భాగంగా మెలిగేవారు. ఇలా త్రిమూర్తులుగా పేరుగాంచిన ఈ ముగ్గురిలో నేడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.
జెస్సీ గత వారం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ అతనికి పరీక్షలు నిర్వహించిన అతని ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ జెస్సీని సీక్రెట్ రూమ్ కి పంపించి తనతో మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితి కుదుటపడకపోవడం వల్ల తనని హౌస్ నుంచి బయటకు పంపించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జెస్సి తను హౌస్ నుంచి వెళ్లి పోతున్నానని చెప్పడంతో ఒక్కసారిగా హౌ సభ్యులందరూ ఎంతో షాక్ అవుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా సిరి, షన్ను తన స్నేహితుడు హౌస్ నుంచి వెళ్ళిపోతున్నాడు అని తెలియడంతో ఒక్కసారిగా తనను కౌగిలించుకుని ఎంతో ఎమోషనల్ అయ్యారు. హౌస్ సభ్యులకు బై చెప్పిన జశ్వంత్ మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చాడు .
ఇక 10వ వారంలో భాగంగా నామినేషన్ లిస్టులో లేని జశ్వంత్ మరో రెండు వారాల పాటు హౌస్లో కొనసాగే వాడని, అయితే తనకు అనారోగ్యం కారణంగా ఇలా మధ్యలోనే బయటకు రావడం అందరిని ఎంతో ఆవేదనకు గురి చేసింది. బయటకు వచ్చిన జెస్సీ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తిరిగి హౌస్ లోకి వెళతాడా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…