మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిరు ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమా రీమేక్ చిత్రమైన భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో చిరంజీవి తో పాటు కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తోంది.
అన్నాచెల్లెళ్ల మధ్య సాగే అనుబంధంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటించే అవకాశాన్ని మిల్క్ బ్యూటీ తమన్నా కొట్టేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా నటిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో తమన్నా నటించడం కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయం గురించి తాజాగా చిత్ర బృందం అధికారిక ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని తమన్నా దక్కించుకున్నారు.
ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవి సరసన నయనతారతో పాటు తమన్నా కూడా నటించారు. ఇక ఈ సినిమా నవంబర్ 11వ తేదీ ప్రారంభం కావడంతో నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…