విజయ్ దేవరకొండ పరిచయం అక్కర్లేని పేరు. తన సొంత ట్యాలెంట్ ను నమ్ముకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అతడితో పాటు తన సోదరడు ఆనంద్ దేవరకొండను ప్రోత్సహిస్తున్నాడు ఈ యువహీరో. అయితే ఇటీవల అతడు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తాను కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నానని.. ఏ నిర్మాత ముందుకు రాకపోవడతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు.

ఈ ఇబ్బందులు మరొకరు పడకూడదనే ఉద్దేశ్యంతో సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశానని అన్నారు. ఇంట్లో పేరెంట్స్ రెంట్ కట్టడానికి ఇబ్బంది ఎదుర్కొన్నా తనకు బైక్ పెట్రోల్ కు డబ్బులు ఇచ్చి ఆడిషన్ కు పంపించేవారన్నారు. విశాఖ పట్నంలో ఆనంద్ దేవరకొండ హీరోగా.. విజయ్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘పుష్పక విమానం’.
ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల వైజాగ్ లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్మాతగా ముందడుగేశా. నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టమైన పని. ఒక్కోసారి ఇది అవసరమా అనిపిస్తుంటుంది అని యువ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. నటుడిగా సినిమా కథలను ఎంపిక చేసుకోవడం.. పాత్రల కోసం శిక్షణ తీసుకోవడం లాంటివే సరిపోతున్నాయి.. ఇక సొంత చేతులపై ఇంకో సినిమా నిర్మించి ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం అంత సులువైన పని కాదంటూ చెప్పుకొచ్చాడు.
ఆత్మవిశ్వాసం, మీరు నాపై పెట్టిన నమ్మకంతో ముందుకెళ్తానన్నాడు. సినిమా చాలా బాగా వచ్చిందని.. ఆనంద్ దీనిలో అద్బుతంగా నటించాడన్నారు. ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లోకి రానుంది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరాడు.
































