Tag Archives: two years

వైసీపీ ప్రభుత్వం పై సిపిఎం నారాయణ ఫైర్!

అమరరాజ ఫ్యాక్టరీని మూసేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు సిపిఎం నేత నారాయణ. రాష్ట్రంలోని కంపెనీలను వైసీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.

కాగా ప్రధాని మోదీని చూసి వైసీపీ ఎంపీల భయపడుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. వైసిపి శ్వేత పత్రం విడుదల చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

రెండేళ్ల జంక్ ఫుడ్ నిల్వ విషయంలో బయటపడిన నిజాలు..!

ప్రతిరోజు జంక్ ఫుడ్ తినడం, దీనికి అలవాటు పడడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలుసు. అయినా దేశంలో ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. ఆశ్చర్యంగా ప్రస్తుత రోజుల్లో పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రతి వీధిలోనూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దర్శనమిస్తున్నాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు దేశంలో ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి చాలా వేగంగా విస్తరిస్తోందని. సరదాగా ప్రతిరోజు మనం తినే పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచి ఫ్రైస్, నూడిల్స్, ఫ్రైడ్ ఆలూ చిప్స్, డోనట్స్ లాంటి జంక్ ఫుడ్ తయారీలో వాడే పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

జంక్ ఫుడ్ లో మోతాదుకు మించి సాచ్యురేటెడ్ కొవ్వులు, ప్రమాదకరస్థాయిలో సాల్ట్, సుగర ఉంటాయి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల చిన్న వయస్సులోనే బిపి, షుగర్‌ ఊబకాయం, గుండె జబ్బులు, ముఖ్యంగా చిన్నపిల్లలకు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలు ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా
ఎలిఫ్‌ కాండెమిర్‌ అనే టిక్‌టాకర్‌ జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల కలిగే అనారోగ్య కారణాలు తెలియజేస్తూ వినూత్నంగా ఓ వీడియోను షేర్ చేసింది.

అసలు విషయానికొస్తే ఎలిఫ్‌ కాండెమిర్‌ తల్లి ఓ పోషకాహార నిపుణురాలు.జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల వచ్చే సమస్యల్ని వివరిస్తూ ఉంటారట. అందులో భాగంగానే ప్రజలకు అవగాహన కల్పించడానికి జంక్ ఫుడ్ ఉన్న ప్యాకెట్లను రెండు సంవత్సరాల పాటు నిల్వ చేసి ఉంచారు.అయితే జంక్ ఫుడ్ లో ప్రమాదకర రసాయనాలు కలపడం వల్ల ఆ ఫుడ్‌ పాడవలేదని, ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆమె టిక్ టాక్ వీడియోలో అద్భుతంగా వివరించే ప్రయత్నం చేశారు.ఏది ఏమైనా మనం ఆరోగ్యవంతమైన సంపూర్ణ జీవితాన్ని గడపాలంటే సాధ్యమైనంతవరకు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటమే మంచిది.