ప్రతిరోజు జంక్ ఫుడ్ తినడం, దీనికి అలవాటు పడడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలుసు. అయినా దేశంలో ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. ఆశ్చర్యంగా ప్రస్తుత రోజుల్లో పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రతి వీధిలోనూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దర్శనమిస్తున్నాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు దేశంలో ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి చాలా వేగంగా విస్తరిస్తోందని. సరదాగా ప్రతిరోజు మనం తినే పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచి ఫ్రైస్, నూడిల్స్, ఫ్రైడ్ ఆలూ చిప్స్, డోనట్స్ లాంటి జంక్ ఫుడ్ తయారీలో వాడే పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
జంక్ ఫుడ్ లో మోతాదుకు మించి సాచ్యురేటెడ్ కొవ్వులు, ప్రమాదకరస్థాయిలో సాల్ట్, సుగర ఉంటాయి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల చిన్న వయస్సులోనే బిపి, షుగర్ ఊబకాయం, గుండె జబ్బులు, ముఖ్యంగా చిన్నపిల్లలకు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలు ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా
ఎలిఫ్ కాండెమిర్ అనే టిక్‌టాకర్ జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే అనారోగ్య కారణాలు తెలియజేస్తూ వినూత్నంగా ఓ వీడియోను షేర్ చేసింది.
అసలు విషయానికొస్తే ఎలిఫ్ కాండెమిర్ తల్లి ఓ పోషకాహార నిపుణురాలు.జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే సమస్యల్ని వివరిస్తూ ఉంటారట. అందులో భాగంగానే ప్రజలకు అవగాహన కల్పించడానికి జంక్ ఫుడ్ ఉన్న ప్యాకెట్లను రెండు సంవత్సరాల పాటు నిల్వ చేసి ఉంచారు.అయితే జంక్ ఫుడ్ లో ప్రమాదకర రసాయనాలు కలపడం వల్ల ఆ ఫుడ్ పాడవలేదని, ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆమె టిక్ టాక్ వీడియోలో అద్భుతంగా వివరించే ప్రయత్నం చేశారు.ఏది ఏమైనా మనం ఆరోగ్యవంతమైన సంపూర్ణ జీవితాన్ని గడపాలంటే సాధ్యమైనంతవరకు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటమే మంచిది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…