Tag Archives: unexpected accident

నాన్నమ్మ మీద కోపంతో ఆమె పై లారీ ఎక్కించిన మనవడు.. చివరికి ఇలా?

సాధారణంగా క్షణికావేశంలో మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితులలోకి వెళ్లి పోతాము. ఇలా క్షణికావేశంలో ఓ యువకుడు తన నాన్నమ్మ ప్రాణాలను బలి తీసుకున్న ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫ్ఫర్‌పూర్‌లోని రక్ష గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దిలీప్ అనే యువకుడు లారీ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇన్ని రోజులు పని నిమిత్తం బయటకు వెళ్లిన దిలీప్ దసరా పండుగ రోజు ఇంటికి వచ్చాడు.

అయితే తను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో పలు మనస్పర్ధలు గొడవలు వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. దీంతో ఈ గొడవలు అన్నింటికీ కారణం తన నాన్నమ్మ అని గ్రహించిన దిలీప్ తన పై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన నానమ్మ ఉదయం ఇంటిముందు ముగ్గు వేస్తున్న సమయంలో దిలీప్ ఆవేశంతో తన లారీని తన నానమ్మ పై ఎక్కించాడు.

ఇలా ఈ ప్రమాదంలో తన నానమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలోనే తన తల్లి మరణించడంతో
దిలీప్ తండ్రి రాజేశ్వర్ రాయ్ తన కొడుకు దిలీప్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా తన ప్రమాదానికి ఉపయోగించిన లారీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు సినిమా షూటింగులో అనుకోని ప్రమాదం.. నీళ్లలో కొట్టుకుపోయిన శారదా డూప్!

సాధారణంగా సినిమా షూటింగ్ జరిగే సమయాలలో కొన్నిసార్లు ప్రమాదాలు తలెత్తడం సర్వసాధారణమే. ముఖ్యంగా కొన్ని ప్రమాదకరమైన సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో హీరోహీరోయిన్లకి బదులుగా వారి డూప్ లతో సినిమాలు చిత్రీకరిస్తున్నారు. ఈ విధంగా అక్కినేని నాగేశ్వరరావు హీరోగామధుసూదన్ రావు దర్శకత్వం వహించిన “అమాయకురాలు” అనే చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో శారద టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో అనుకోని ప్రమాదం జరిగే శారదకు డూప్ గా నటిస్తున్నటువంటి ఆమె నీళ్లలో కొట్టుకుపోవడంతో చిత్రబృందం మొత్తం కంగారు పడ్డారు.

కథ ప్రకారం విలన్ రెండవ పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం ఆమెను చంపాలని భావిస్తాడు. ఈ క్రమంలోనే శారదను పిక్నిక్ తీసుకువెళ్లి నీళ్ళల్లో తోసే సన్నివేశాన్ని చిత్రీకరించాలి. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం చిత్ర బృందం కేరళలోని త్రివేండ్రం దగ్గరలో ఉన్న అరువికెరా డ్యామ్‌కు వెళ్లారు. అయితే శారదకు ఈత రాకపోవడం వల్ల ఆమె స్థానంలో ఒక మళయాళీ అమ్మాయి డూప్ గా నటించారు.

అయితే ఆమె నడుముకి రెండు తాళ్ళు కట్టి అవి కనపడకుండా నీటిలో వదిలేసి ఇద్దరు సెట్ బాయ్ లను ఆ తాళ్లను గట్టిగా పట్టుకొమ్మని చెప్పారు. డైరెక్టర్ స్టార్ట్ కెమెరా అనగానే డ్యామ్ కున్న 6 లాకర్స్ తెరుచుకొని ఎక్కువ మొత్తంలో నీటి ఉధృతి వచ్చింది. అదే సమయంలో కెమెరాలో తాళ్లు పట్టుకున్న సెట్ బాయ్స్ కనిపించడంతో డైరెక్టర్ గట్టిగా అరిచారు. ఈ క్రమంలోనే వారు ఉలిక్కిపడి తాళ్లని వదిలేయడంతో శారద డూప్ లో నటిస్తున్నటువంటి అమ్మాయి సుమారు 200 గజాల దూరం వరకు కొట్టుకుపోయింది.

ఈ విధంగా ఆ నీటి ఉధృతిలో అమ్మాయి కొట్టుకుపోతుంటే యూనిట్ సభ్యులు ఎంతో కంగారు పడ్డారు. ఈ క్రమంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆమెను పట్టుకోవాలని నీళ్లలోకి దూకినప్పటికీ వీలు కాలేదు. ఈ క్రమంలోనే స్థానిక ఇద్దరు యువకులు నీళ్లలో దూకి వారిద్దరిని ఒడ్డుకు చేర్చారు. అయితే శారద డూప్ లో నటిస్తున్నటువంటి మలయాళి అమ్మాయికి కూడా ఈత రాకపోయినప్పటికీ ఈత వచ్చని చెప్పడం, డైరెక్టర్ డ్యామ్ 4 లాకర్లు తెరవమంటే ఆరు తెరవడం వల్ల ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని ఆ తర్వాత తెలిసింది.