Tag Archives: UP Corona Cases

పోలీసుల ఎదుటే కరోనా శవాన్ని దారుణంగా.. చివరికి?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు అధికం అవుతున్న నేపథ్యంలో కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశాన వాటికలో స్థలం లేకపోవడంతో ఎన్నో మృతదేహాలు గంగానదిలో కొట్టుకు వస్తున్న ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికి కూడా గంగానది ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకునే వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విధంగా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాలు పట్ల ఉత్తరప్రదేశ్లో అమానవీయ చోటు చేసుకుంది.

యూపీలోని బలియాలో గంగానది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాన్నికోవిడ్ మృతదేహంగా భావించి అక్కడ ఉన్న స్థానికులు ఆ శవాన్ని కట్టెలపై ఉంచి పెట్రోల్, టైర్లు వేసి దహనం చేశారు. అయితే ఈ ఘటన ఐదుగురు పోలీసుల సమక్షంలో జరగడంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గంగా నది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపించాలని,అందుకు తగిన ఆర్థిక సహాయం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందని ఇదివరకే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపినప్పటికీ, పోలీస్ అధికారులు ఎంతో బాధ్యతారహితంగా మృతదేహం పట్ల ఈ విధంగా వ్యవహరించడంతో అధికారులు ఆ అయిదుగురు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా గంగానది ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయని, ఈ విధంగా మృతదేహాలు నీటిలో కలపడం వల్ల నీరు కలుషితంగా మారి మరి కొన్ని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని, నీటి ద్వారా ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భయంకరమైన నిజాలు.. కరోనా రోగులకు నీళ్లతో ఇంజెక్షన్లు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది వైరస్ బారినపడి సరైన సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే వైద్య సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ మరి కొందరు ప్రాణాలు తీస్తున్నారు. రోగులకు అందాల్సిన మందులను పక్కదారి పట్టిస్తూ డబ్బు పోగు చేసుకుంటున్నారు. రోగులకు అందించాల్సిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముకుంటూ, రోగులకు నీళ్లతో ఇంజెక్షన్ లు వేస్తున్న ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ మీరట్ లో చోటు చేసుకుంది.

నగరంలోని సుబర్తి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో కరోనా రోగులకు చేరాల్సిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ఇద్దరు వార్డ్ బాయ్ లు కలసి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క ఇంజక్షన్ బయట మార్కెట్లో దాదాపు రూ.25 వేలకు అమ్మకుంటున్నట్లు పోలీసులకు తెలియడంతో ఆ వార్డ్ బాయ్ ల పై పోలీసులు మఫ్టీలో వచ్చి నిఘా వేశారు.

మఫ్టీలో వచ్చిన పోలీసులు వార్డు బాయిలను గమనించగా కరోనా రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను మార్కెట్ లో అమ్ముకుంటూ వారికి డిస్టిలరీ వాటర్ ఇంజెక్షన్లు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటమాడారు.ఇది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో ఆస్పత్రి బౌన్సర్లు పోలీసులపై దాడి చేశారు.

ఈ సంఘటనకు సంబంధించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి సుమారు 81 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంజక్షన్ లను బయట మార్కెట్లో 25 నుంచి 40 వేల వరకు అమ్ముతున్నారని డీసీసీ మోనికా భరద్వాజ్ వెల్లడించారు.