Tag Archives: vibhudi

Saipallavi: నటి సాయి పల్లవికి ఉన్న ఈ విచిత్రమైన అలవాటు తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Saipallavi: నటి సాయి పల్లవి తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇలా సినిమాల ద్వారా ఎంతో హిట్ అందుకున్నటువంటి సాయి పల్లవి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకొని నటిస్తూ ఉంటారు.ఇకపోతే సాయి పల్లవి ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

తమిళ హీరో శివ కార్తికేయన్ కిజోడిగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇదిలా ఉండగా తాజాగా ఒక తమిళ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవి తనకు ఉన్నటువంటి ఒక విచిత్రమైన అలవాటు గురించి బయటపెట్టారు. ఈ విషయం తెలిసే అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా కొందరికి కొన్ని పదార్థాలను తినడానికి చాలా ఇష్టపడుతుంటారు అయితే వాటిని చాలా రహస్యంగా తింటూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి సాయి పల్లవికి కూడా విభూది తినడం అంటే చాలా ఇష్టమట. ఈమె ఎక్కడికి వెళ్లిన ఆ విభూతి మాత్రం తన బ్యాగులోనే ఉంటుందట అలా ఈమె ఎవరికీ తెలియకుండా తనకెంతో ఇష్టమైనటువంటి ఈ విభూదిని తరచూ తింటూ ఉంటానని తెలిపారు.

Saipallavi: ప్రత్యేకమైన చెక్కతో తయారు చేసినది…


ఇలా తనకు విభూది తినే అలవాటు ఉందని చెప్పడంతో ఒక్కసారిగా నేటిజన్స్ షాక్ అయ్యారు ఇదేం విచిత్రమైన అలవాటు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే సాయి పల్లవి తీసుకొనే ఆ విభూది ఒక ప్రత్యేకమైన చెక్కతో తయారు చేసినదని ఇది తినడానికి రుచికరంగాను ఎంతో సువాసన భరితంగా ఉంటుందని ఈ సందర్భంగా సాయి పల్లవి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విభూదిని ఎలా తయారు చేస్తారు.. దీని వల్ల ఉపయోగం ఏంటో తెలుసా..?

విబూది అంటే మనం సాధారణంగా భస్మం అని అనుకుంటాం. కానీ దీనికి ఏది పడితే అది వాడరు. అగ్ని హోత్రంలో వచ్చిన భస్మాన్ని మాత్రమే వాడతారు. ఇది ఒక పవిత్రమైన పాపాలను హరించే సూచికకు వాడుతారు. కాలిపోయి బూడిద అయిన ప్రతీ ఒక్కదానిని భస్మం అనకూడదరు. ఎక్కువ శాతం మంది ఆవు పేడను పిడకలుగా చేసి విభూదిని తయారు చేస్తారు.

దీనినే ఎక్కువగా భస్మం అంటారు. లేదా అగ్ని హోత్రంలో వాడే ద్రవ్యాలు ప్రధానంగా ఆవు పిడకలు, నెయ్యి, మోదుగ పుల్లలు ,మామిడి చెక్క లేదా అటువంటి వాటిచే సూచించబడిన దాదాపు 108 పదర్థాలతో చేసిన వాటిని కూడా భస్మంగా పరిగణిస్తారు. ఇక్కడ తయారు చేసిన భస్మం పూర్తిగా తెలుపు రంగులో ఉండదు. కొంచెం రంగు మారుతుంది.

ఈ భస్మాన్ని ధరిస్తే వాటిలో ఉన్న ఔషద గుణాల కారణంగా శరీరానికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది అనేది మొదటి నుంచి వస్తున్న విశ్వాసం. పిడకలను ముందుగా వేదమంత్రాల మధ్య కాలుస్తారు. తర్వాత వాటిని చల్లార్చి తడిపి.. దిమ్మలుగా తయారు చేస్తారు. వీటినే తర్వాత బిభూది పండ్లుగా భక్తులకు అందజేస్తారు.

దేవాలయాలు మన దేశంలో ఎక్కువగా తమిళనాడు, కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడ వెలసిన ఆలయాల్లో ఈ విభూది పండ్లను ఉపయోగిస్తారు. విభూది చాలామంది నుదిటిపై, ఛాతిపై ధరిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో గొంతుమీద కూడా ధరిస్తారు. తమకు తాము ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం కోసం విభూదిని వాడుతారు. ఈ విభూది వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి. చర్మవ్యాధులకు సంబంధించి దూరంగా ఉంటారు అనేది నిపుణులు చెబుతున్నారు.

సోమవారం భస్మధారణ ఎందుకు చేస్తారో తెలుసా..?

ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైనది సోమవారం రోజు శివుని పూజించే భక్తులు అందరూ తప్పనిసరిగా విభూదిని ధరిస్తారు. విభూది అంటే శివుడికి ఎంతో ఇష్టమైనది అని చెప్పవచ్చు. శివుడికి ఇష్టమైన ఈ విభూదిని ధరించడం వల్ల వారికి అన్ని వేళలా ఆ పరమశివుడు తోడై ఉంటాడని పండితులు చెబుతున్నారు.భస్మధారణ చేయకుండా జపాలు, తపస్సులు చేయడంవల్ల ఎలాంటి ఫలితాలు కలగవని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే మన శరీరంలో 32 చోట్ల భస్మధారణ చేయాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా సోమవారం భస్మధారణ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

శిరస్సు, రెండు చేతులు, గుండె, నాభి అనే ఐదు ప్రదేశాల్లో భస్మాన్ని ధరించడం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా మూడు గీతలు భస్మాన్ని ధరించడం వల్ల మన జీవితంలో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయని చెబుతారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఒక రోజు విహారానికి వెళుతూ తను ధరించడానికి నగలు, ఐశ్వర్యం కావాలని ఆ పరమశివుని అడగగా.. అందుకు శివుడు కొద్దిగా విభూతిని ఇచ్చి కుబేరుడి వద్దకు వెళ్లి విభూతిని ఇచ్చి తనకు కావలసింది తీసుకోమని తెలియజేస్తాడు.

శివుడు చెప్పిన విధంగానే పార్వతీదేవి ఆ విభూదిని తీసుకొని కుబేరుడు దగ్గరకు వెళ్లి ఆ విభూతికి సరిపడ నగలు ఇవ్వాల్సిందిగా కోరుతుంది.ఆ విధంగా విభూదిని త్రాసులో పెట్టి కుబేరుడు ఉన్న ఐశ్వర్యం అంతటిని త్రాసులో ఉంచినప్పటికీ కూడా త్రాసు లేవలేదు. దీనిని బట్టి శివుడు ఎంతో నిరాడంబరంగా ఉంటూ తన భక్తులకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. అందుకోసమే శివుని ఐశ్వర్య ప్రదాత అని కూడా పిలుస్తారు. అందువల్ల ఆ పరమశివుని పూజించే భక్తులు సోమవారం భస్మధారణ తప్పకుండా చేయాలని వేద పండితులు చెబుతున్నారు.