Tag Archives: Vinayaka chaviti

Vijay Devarakonda: పెళ్లి తర్వాత కూడా నా జీవితం అలాగే ఉండాలి…. పెళ్లి గురించి అలాంటి కామెంట్స్ చేసిన విజయ్?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్నటువంటి చిత్రం ఖుషి. ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ఆరాధ్య అనే లిరికల్ సాంగ్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే తాజాగా ఈ పాట గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.

ఖుషి సినిమాలో తనకు నచ్చిన పాటలలో ఆరాధ్య పాట ఒకటని తెలిపారు. ఈ పాటలో పెళ్లి అయిన ఏడాది తర్వాత వరకు భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే విషయాలను చాలా అద్భుతంగా చూపించారని తెలిపారు. ఇక పెళ్లి జరిగిన తర్వాత కూడా నా లైఫ్ ఈ పాట మాదిరిగానే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలియచేశారు.

Vijay Devarakonda:నా జీవితం అలాగే ఉండాలి..

ఈ విధంగా విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విజయ్ దేవరకొండ నటి రష్మిక మందన్నతో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ మేము స్నేహితులం అని చెప్పినప్పటికీ వీరిద్దరి మధ్య రహస్య ప్రేమ ప్రయాణం కొనసాగుతుందని అందరూ భావిస్తున్నారు.

Anchor Rashmi: రష్మీ హిందూ వ్యతిరేకన్న నెటిజన్… తన స్టైల్ లో సమాధానం చెప్పిన రష్మీ!

Anchor Rashmi: రష్మి గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు బుల్లితెర కార్యక్రమం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ వెండితెరపై పలు సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా వెండితెరపై నటిగా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన ఈమె బుల్లితెరపై తనదైన శైలిలో అందరిని సందడి చేస్తున్నారు.

ఇలా బుల్లితెరపై జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ముఖ్యంగా మూగ జంతువులను ఎవరైనా హింసిస్తే తప్పకుండా ఆ ఘటనపై స్పందిస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఇదిలా ఉండగా వినాయక చవితి సందర్భంగా ఓ వినాయకుడి ప్రతిమకు ఏనుగుతో గజమాల వేయించారు.

ఈ ఘటనపై స్పందించిన రష్మీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వినాయకుడికి గజమాల వేయడం కోసం ఆ ఏనుగు ఎంత బాధ అనుభవించుంటుందో నాకు తెలుసు మన సంతోషం కోసం మూగజీవాలను ఇబ్బంది పెట్టకూడదు అంటూ ఈమె ట్వీట్ చేశారు.అయితే రష్మీ ఈ విధంగా ట్వీట్ చేయడంతో కొందరు నెటిజెన్లు స్పందిస్తూ నువ్వు హిందూ వ్యతిరేకివి హిందూ పండుగలనే టార్గెట్ చేస్తావు అంటూ కామెంట్ చేశారు.

Anchor Rashmi: ఆ మూడు రోజులు నొప్పిని భరించలేను…

ఈ విధంగా నెటిజన్ చేసిన కామెంట్ పై స్పందించిన రష్మీ..తాను నంది, గోమాతను పూజిస్తానని అందుకే తాను లెదర్ వస్తువులను అలాగే పాలు పాలతో తయారు చేసిన వస్తువులను తిననని తెలిపారు. ఒక ఆవు పాలు ఇవ్వడం కోసం ఎన్ని సార్లు గర్భవతి అవుతుందనే నిజాన్ని నేను తట్టుకోలేను. అంతెందుకు ఓ మహిళగా రుతుక్రమ సమయంలో వచ్చే మూడు రోజుల నొప్పి కూడా నాకు ఎంతో నరకంగా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా ఆమె తన స్టైల్ లో సమాధానం చెప్పుకొచ్చారు ప్రస్తుతం రష్మీ చేసిన ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

మళ్లీ తెరపైకి శ్రీ వినాయక విజయం సినిమా.. అతడి గురించి వెతుకుతున్న నెటిజన్లు..

ప్రత్యేక పండుగలు.. ఏదైనా ముఖ్యమైన రోజులు ఉంటే దానికి సంబంధించి సినిమాలు టీవీల్లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. ఆ రోజు ప్రాధాన్యతను బట్టి సినిమాలు వస్తుంటాయి. ఇలా పాత సినిమాలు అయినా ప్రేక్షకులు వాటిని ఆదరిస్తుంటారు. ఇలాంటిదే నేడు వినాయక చవితి సందర్భంగా ‘శ్రీ వినాయక విజయం’ సినిమాను టీవీల్లో ప్రసారం చేస్తున్నారు.

ప్రతీ వినాయక చవితికి క్రమం తప్పకుండా ఈ సినిమా టీవీలో వస్తూనే ఉంటుంది. 1979 లో విడుదలైన ఈ సినమాలో కృష్ణంరాజు, వాణిశ్రీలు శివపార్వతులుగా నటించారు. అంతేకాకుండా అందులో వినాయకుడి గెటప్ లో నటించింది.. బేబీ లక్ష్మి సుధా. ఈమె బాల గణేషుడిగా అలరించింది. తర్వాత ఏనుగు ముఖంతో ఆమె ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. పెద్దయ్యాక వినాయకుడి గెటప్‌లో నటించింది ఎంజీవీ మదన్‌గోపాల్‌ అనే ఆర్టిస్ట్‌. అయితే అతడి గురించి ప్రస్తుతం గూగుల్ లో తెగ వెతుకుతున్నారు.

అతడు ఎవరు.. ప్రస్తుతం ఏం చేస్తున్నారనే విషయాలను సెర్చ్ చేస్తున్నారు. కనీసం ఫొటో అయినా చూడాలని తెగ ఆరాటపడ్డారు. కానీ దానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు. ఇలా నెటిజన్లు ఆ వివరాల కోసం వెతకడంతో ఆ సినిమా ప్రస్తుతం వైరల్ గా మారింది.

అటు సోషల్ మీడియాలో కూడా ఆ సినిమా గురించి విషయాలను షేర్ చేస్తూ ఉన్నారు. దీంతో మళ్లీ తెరపైకి ‘శ్రీ వినాయక విజయం’ వైరల్ గా మారింది. అందులో ఎవరవయ్యా.. ఎవరవయ్యా అంటూ సాగే గానం.. ఈ పండగ రోజున ప్రతీ ఇళ్లల్లో మారు మోగిపోతోంది.

గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు.. మాంసం అమ్మకాలపై నిషేధం..

వినాయక చవితి సందర్భంగా మాంసం అమ్మకాలపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా బెంగళూరు నగరంలో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జంతువులను చంపడం, మాంసం అమ్మకాన్ని నిషేధిస్తూ బీబీఎంపీ జాయింట్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని నగర పాలిక సంస్థ హెచ్చరించింది. సెప్టెంబర్ 10 నుంచి నగరంలో మూడు రోజుల గణేశ పూజ వేడుకలను మాత్రమే బహిరంగ ప్రదేశాలలో అనుమతించింది. విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు లేదా నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి ఊరేగింపు ఉండరాదని అధికారులు తేల్చి చెప్పారు.

బీబీఎంపీ చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. బెంగళూరు నగరంలో గణేశ ఉత్సవాన్నిమూడు రోజులకు మించి అనుమతించబోమని ఎలాంటి ఊరేగింపు ఉండరాదని చెప్పారు. అంతే కాకుండా ఉత్సవాల్లో 20 మందికి మించి పాల్గొనకూదని కూడా ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

కరోనాను కట్టడి చేసేందుకు పండుగ సమయంలో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుందని ఈ నిబంధనలు తేల్చి చెప్పాయి. కేవలం మట్టి విగ్రహాలకే అనుమతులు ఉన్నాయని, అలాగే చవితి ఉత్సవాల్లో ఆహారం లేక ప్రసాదం పంపిణీకి కూడా అనుమతించబోమని ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గతేడాది కూడా కరోనా కారణంగానే ఉత్సవాలపై ఆంక్షలు విధించగా.. ఈ సారి కూడా అవే ఆంక్షలను కొనసాగిస్తున్నారు అధికారులు.