ప్రత్యేక పండుగలు.. ఏదైనా ముఖ్యమైన రోజులు ఉంటే దానికి సంబంధించి సినిమాలు టీవీల్లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. ఆ రోజు ప్రాధాన్యతను బట్టి సినిమాలు వస్తుంటాయి. ఇలా పాత సినిమాలు అయినా ప్రేక్షకులు వాటిని ఆదరిస్తుంటారు. ఇలాంటిదే నేడు వినాయక చవితి సందర్భంగా ‘శ్రీ వినాయక విజయం’ సినిమాను టీవీల్లో ప్రసారం చేస్తున్నారు.
ప్రతీ వినాయక చవితికి క్రమం తప్పకుండా ఈ సినిమా టీవీలో వస్తూనే ఉంటుంది. 1979 లో విడుదలైన ఈ సినమాలో కృష్ణంరాజు, వాణిశ్రీలు శివపార్వతులుగా నటించారు. అంతేకాకుండా అందులో వినాయకుడి గెటప్ లో నటించింది.. బేబీ లక్ష్మి సుధా. ఈమె బాల గణేషుడిగా అలరించింది. తర్వాత ఏనుగు ముఖంతో ఆమె ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. పెద్దయ్యాక వినాయకుడి గెటప్‌లో నటించింది ఎంజీవీ మదన్‌గోపాల్ అనే ఆర్టిస్ట్. అయితే అతడి గురించి ప్రస్తుతం గూగుల్ లో తెగ వెతుకుతున్నారు.
అతడు ఎవరు.. ప్రస్తుతం ఏం చేస్తున్నారనే విషయాలను సెర్చ్ చేస్తున్నారు. కనీసం ఫొటో అయినా చూడాలని తెగ ఆరాటపడ్డారు. కానీ దానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు. ఇలా నెటిజన్లు ఆ వివరాల కోసం వెతకడంతో ఆ సినిమా ప్రస్తుతం వైరల్ గా మారింది.
అటు సోషల్ మీడియాలో కూడా ఆ సినిమా గురించి విషయాలను షేర్ చేస్తూ ఉన్నారు. దీంతో మళ్లీ తెరపైకి ‘శ్రీ వినాయక విజయం’ వైరల్ గా మారింది. అందులో ఎవరవయ్యా.. ఎవరవయ్యా అంటూ సాగే గానం.. ఈ పండగ రోజున ప్రతీ ఇళ్లల్లో మారు మోగిపోతోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…