ప్రముఖ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చారు. గౌతమ్ మీనన్ తమిళ చిత్రం నీతనే ఎన్ పొన్వసంతం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. మొదటి నుంచి ఆమె తన కామెడీతో అందరినీ మెప్పించింది. ఇదిలా ఉండగా ఆమెకు ఆగస్టు 26న నిశ్చితార్థం జరిగిందని.. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది.
ఆమె ప్రియుడు, ఫిట్‌నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను ఆమె సెప్టెంబర్ 9 న వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట దర్శనమిచ్చాయి. కాగా ఇటీవల శరారకృతిపై దృష్టిపెట్టిన విద్యుల్లేఖకు ఫిట్‌నెస్ నిపుణుడు సంజయ్‌తో పరిచయమైంది. ఆ తర్వాత వారి రిలేషన్ ప్రేమగా మారి, పెళ్లి వరకు వచ్చింది.
తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి కమెడియన్‌గా మంచి పేరును సాధించుకున్నారు. తెలుగు, తమిళ చిత్రాలతో పరిచయమైన ఈమె.. తనదైన యాస, డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోంది. పెళ్లి తరువాత విద్యుల్లేఖ సినిమాల్లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా దాంపత్య జీవితానికి వెల్ కమ్ అంటూ చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఆమె ఇప్పుడు చాలా తక్కువమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తమిళ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నేడు అంగరంగా వైభవంగా జరిగింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…