నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన విజయ్ దేవరకొండ… పెళ్లి చూపులు చిత్రం హీరోగా మంచి బ్రేక్‌ని ఇచ్చింది. ఈ మూవీలో ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు . తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్‌ని సృష్టించింది. అతన్ని ఓవర్ నైట్ స్టార్‌ని చేసింది.
తదనంతరం వచ్చిన టాక్సీవాలా, గీత గోవిందంతో చక్కని విజయాన్ని అందుకొని… తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విజయ్… ఒక సెన్సేషన్ &యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకున్నా తన టాలెంట్‌తో సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ.
పాన్ ఇండియా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగిన విజయ్.. సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవారనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అందరిలాగే ఆయన కూడా కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్లేవాడట. సినిమా టికెట్స్ కోసం గంటల తరబడి థియేటర్స్ ముందు నిల్చునేవారట. హీరో కాకముందు ఓ సాధారణ ప్రేక్షకుడిగా తాను పొందిన అనుభవాలు.. ఇప్పటికీ తన ఆడియన్స్‌ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయని ఆయన అంటుంటారు. ఆడియన్స్ పట్ల విజయ్ దేవరకొండ దృష్టి భిన్నంగా ఉంటుందట. నటుడు, ఆడియన్స్ అనే భేదభావం విజయ్ దేవరకొండకు ఉండదట. తన సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులను తన ఫ్రెండ్స్ వలె భావిస్తారట.
ఓ చిన్న నటుడిగా కెరీర్ బిగిన్ చేసి, సపోర్టింగ్ హీరోగా ఎదిగి, స్టార్ హోదా దక్కించుకున్న విజయ్ దేవరకొండ.. పూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా ఇదిలా ఉండగా తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో మూవీని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…