Movie News

Anchor Rashmi: రష్మీ హిందూ వ్యతిరేకన్న నెటిజన్… తన స్టైల్ లో సమాధానం చెప్పిన రష్మీ!

Anchor Rashmi: రష్మి గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు బుల్లితెర కార్యక్రమం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ వెండితెరపై పలు సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా వెండితెరపై నటిగా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన ఈమె బుల్లితెరపై తనదైన శైలిలో అందరిని సందడి చేస్తున్నారు.

ఇలా బుల్లితెరపై జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ముఖ్యంగా మూగ జంతువులను ఎవరైనా హింసిస్తే తప్పకుండా ఆ ఘటనపై స్పందిస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఇదిలా ఉండగా వినాయక చవితి సందర్భంగా ఓ వినాయకుడి ప్రతిమకు ఏనుగుతో గజమాల వేయించారు.

ఈ ఘటనపై స్పందించిన రష్మీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వినాయకుడికి గజమాల వేయడం కోసం ఆ ఏనుగు ఎంత బాధ అనుభవించుంటుందో నాకు తెలుసు మన సంతోషం కోసం మూగజీవాలను ఇబ్బంది పెట్టకూడదు అంటూ ఈమె ట్వీట్ చేశారు.అయితే రష్మీ ఈ విధంగా ట్వీట్ చేయడంతో కొందరు నెటిజెన్లు స్పందిస్తూ నువ్వు హిందూ వ్యతిరేకివి హిందూ పండుగలనే టార్గెట్ చేస్తావు అంటూ కామెంట్ చేశారు.

Anchor Rashmi: ఆ మూడు రోజులు నొప్పిని భరించలేను…

ఈ విధంగా నెటిజన్ చేసిన కామెంట్ పై స్పందించిన రష్మీ..తాను నంది, గోమాతను పూజిస్తానని అందుకే తాను లెదర్ వస్తువులను అలాగే పాలు పాలతో తయారు చేసిన వస్తువులను తిననని తెలిపారు. ఒక ఆవు పాలు ఇవ్వడం కోసం ఎన్ని సార్లు గర్భవతి అవుతుందనే నిజాన్ని నేను తట్టుకోలేను. అంతెందుకు ఓ మహిళగా రుతుక్రమ సమయంలో వచ్చే మూడు రోజుల నొప్పి కూడా నాకు ఎంతో నరకంగా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా ఆమె తన స్టైల్ లో సమాధానం చెప్పుకొచ్చారు ప్రస్తుతం రష్మీ చేసిన ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago