Categories: FeaturedMovie News

Big Boss Season6 : యూట్యూబ్ లో బిగ్ బాస్ హౌస్ రివ్యూస్ చెప్తూ… ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఛాన్స్..!

Big Boss Season6 : బుల్లితెర మీద బిగ్ బాస్ హౌస్ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు కూడా బిగ్ బాస్ బాగా కనెక్ట్ అయ్యింది. బుల్లితెర మీద మాత్రమే కాదు ఓటీటీ లో ప్రసారం అయిన బిగ్ బాస్ కి కూడా మంచి ఆదరణ లభించింది. ఇప్పటి వరకు అయిదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రోగ్రాం ఇపుడు ఆరవ సీజన్ కి కూడా సిద్ధం అయింది. సెప్టెంబర్ 4 నుండి మొదలు కానున్న బిగ్ బాస్ ఆరవ సీజన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో కామన్ మాన్ ఎంట్రీ…

ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ హోస్ట్ గా నాగార్జున గారే వ్యవహారిస్తున్నారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్ సందేశ్ – వితిక లాగ ఈసారి బుల్లితెర జంట రోహిత్-మెరీనా అబ్రహం లు ఉండబోతున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యుడు కూడా రాబోతున్నాడు అని, అతను ఎవరో కాదు యూట్యూబర్ ఆదిరెడ్డి అని వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ రివ్యూలు చెబుతూ నెటిజన్లకు దగ్గర అయ్యాడు.

వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఆదిరెడ్డి సొంతూరు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని వరికుంట‌పాడు. ప్రస్తుతం ఆదిరెడ్డి తల్లితండ్రులు, అన్నయ్య, అక్కచెల్లెలితో కలిసి ఉంటున్నారు. డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేసిన ఆదిరెడ్డి, వైఎస్సార్ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ తో బీటెక్ పూర్తి చేసి రూ. 10,000 జీతం తో క్యాంపస్ లో ఉద్యోగం సంపాదించాడు. అయితే తల్లి మరణం తో ఉద్యోగం కి వెళ్లకుండా రెండేళ్ల తరువాత ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లడం, అప్పుడే బిగ్ బాస్ సీజన్2 కి సరదాగా రివ్యూ చెప్పి పోస్ట్ చేయడం జరిగింది. అది బాగా క్లిక్ అవ్వడం తో యూట్యూబ్ ఛానల్ పెట్టి కంటిన్యూ చేశారు. ఇపుడు ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago