Featured

Ramesh Reddy : దాదాపు 3 కోట్ల దాకా డబ్బు ఎగ్గొట్టారు… వెంకటేష్ గారి సినిమాకు నంది మాకు వస్తే వేరేవాళ్ళ పేరు వేశారు : రమేష్ రెడ్డి

Ramesh Reddy : సినిమాల్లో నటుడుగా, రైటర్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి సినిమాలకు పనిచేసిన రమేష్ రెడ్డి గారు హరీష్ శంకర్ కు బాగా సన్నిహితుడు. హరీష్ శంకర్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నపటినుండి ఇద్దరికీ పరిచయం ఉండటం వల్ల అప్పటి ఉండే ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకునేవారు. ఇక బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలతోనే కాకుండా రవితేజ, గోపీచంద్ వంటి హీరోలతో మంచి బాండ్ ఉన్న రమేష్ రెడ్డి గారు ఏవైనా మంచి కథలు దొరికితే రవి తేజ, గోపీచంద్ కి మొదట చెప్తారట. ఇక స్క్రిప్ట్ విన్నప్పుడే అది హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో రమేష్ రెడ్డి గారు చెప్పేస్తారట అందుకే అయనను రెబెల్ రమేష్ అని పిలుస్తారట. ఇక ఉన్నది ఉన్నట్లు చెప్పే రమేష్ రెడ్డి గారు దానివల్ల అవకాశాలు కూడా వదులుకున్నారు. ఇక నటనతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ రెడ్డి గారు తొలి అనుభవాన్ని పంచుకున్నారు.

పని చేయించుకుని డబ్బు చాలా మంది ఎగ్గొట్టారు…

ఇక సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది పని చేయించుకుని డబ్బు ఇచ్చేటపుడు మస్కా కొడతారు అంటూ చెప్పారు రమేష్ రెడ్డి. ఇప్పటి వరకు అలా దాదాపు 3 కోట్లు దాకా నష్టపోయుంటానని చెప్పారు. కొంతమంది యాభై వేలు ఇస్తామని చెప్పి పది వేలు చేతిలో పెట్టి చేయి దులుపుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మంది చివరిదాకా డబ్బు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మొహం చాటేసిన వాళ్ళు ఉన్నారు. అయినా పని మానకూడదు కదా పేరు ముఖ్యం అనుకున్నాను అని రమేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

నంది అవార్డు మాకోస్తే వేరేవాళ్ళ ఫోటోలు వేశారు…

ఇక వెంకటేష్ గారికి ‘శీను’ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసారు. ఇక ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాకు గాను నంది అవార్డు రైటర్స్ కి వచ్చింది. అయితే ఆ అవార్డు గోపి, రమేష్ రెడ్డి ల ద్వయానికి వస్తే గోపి, మొహన్ ల పేర్లను పత్రికలో ఫొటోలతో సహా వేసినపుడు చాలా బాధగా అనిపించిందట. మళ్ళీ తప్పును సరిదిద్దుకుని పత్రికల వాళ్ళు రమేష్ గారి ఫోటోను ప్రచురించారట.

అలా ఇండస్ట్రీ లో పెద్దగా మార్కెటింగ్ చేసుకోకపోవడం వల్ల చాలా మందికి రైటర్ గా నేను తెలియదు. అలాగే డబ్బు డిమాండ్ చేయడం రాకపోవడం అలుసు గా తీసుకుని డబ్బు ఎగ్గొట్టడం చేయడం వల్ల చాలా నష్టపోయాను కానీ కొత్తగా మార్కెటింగ్ చేసుకోలేను, అది నా వ్యక్తిత్వం కాదు మళ్ళీ కొత్తగా మార్చుకుంటే రాదు. అయితే అలా ఎవరైనా నాకు డబ్బు ఎగ్గొట్టినపుడు మొదట్లో పెద్దగా అనిపించేది కాదు కానీ పెళ్ళై కుటుంబం ఏర్పడ్డాక అలా ఎవరైనా ఎగ్గొడితే బాధేస్తుంది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago