Tag Archives: Women empowerment

Actress Sonia: హ్యాపీ డేస్ లో రింగుల జుట్టుతో కవ్వించిన సోనియా .. ఇప్పుడెలా ఉందో తెలుసా..?

Actress Sonia: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమాలో స్రవంతి ( శ్రావ్స్ ) పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న రింగల జుట్టు చిన్నది సోనియా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007 లో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ గా విడుదలైన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించిన తమన్నా, వరుణ్ సందేశ్ జోడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే టైసన్‌ (రాహుల్‌) అతని లవర్‌ శ్రావ్స్‌ (సోనియా దీప్తి ) జంట కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
రింగురింగుల జుట్టుతో ఉన్న సోనియా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో చాలామంది ఫ్యాన్స్‌ అయిపోయారు. ఇలా హ్యాపీ డేస్ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన వీరు హీరో, హీరోయిన్లు గా బాగా ఫెమస్ అయ్యారు.

సోనియా కూడా హ్యాపీ డేస్ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించింది మెప్పించింది. ఆ తరువాత దూకుడు, ఆవారా వంటి సినిమాలలో స్నేహితురాలి పాత్రలో నటించి మెప్పించింది. 2016లో చిన్ని చిన్నీ ఆశలు నాలో రేగేనే అనే తెలుగు సినిమాలో కనిపించిన సోనియా 2017లో ఒక తమిళ్ సినిమాలో నటించింది.
ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు రాకపోవటంతో సిల్వర్ స్ర్కీన్‌పై కనిపించలేదు.

Actress Sonia: సామాజిక సేవ కార్యక్రమాలలో బిజీ…


సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సోనియా సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల మహిళా సాధికారత, మోరల్‌ పోలీసింగ్‌లకు సంబంధించి ఆమె రిలీజ్‌ చేసిన షార్ట్‌ ఫిలిమ్స్‌కు మంచి పేరొచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ వెండితెరపై అడుగుపెట్టేందుకు సోనియా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అనుష్క, నవీన్‌ పొలిశెట్టి జంటగా తెరకెక్కుతోన్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

మహిళా తలుచుకుంటే ఏదైనా సాధ్యమే_ మోదీ

మహిళ సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్​’ కార్యక్రమంలో భాగంగా పలు స్వయం సహకార సంఘాలకు(ఎస్​హెచ్​జీ) చెందిన మహిళలతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు.

మహిళలు తలుచుకుంటే ఎలాంటి మార్పునైనా తీసుకురాగలరని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్​’ కార్యక్రమంలో భాగంగా పలువురు సహకార సంఘాల మహిళలతో ఆయన సమావేశమయ్యారు.