Tag Archives: World Health Organization

ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసిన డబ్ల్యూహెచ్ఓ..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతల బయపెట్టిందో అందరికీ తెలుసు. గత ఏడాదిలో విజృంభించిన కరోనా నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్‌ వణుకు పుట్టిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌.. ఇప్పుడు ప్రపంచ ఆదేశాలన్నింటికి పాకుతోంది. ఈ వేరియంట్‌ కేసులు భారత్‌ క్రమ క్రమంగా పెరుగుతున్నాయి.

కోవిడ్-19 యొక్క వేరియంట్ లలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న వేరియంట్ ఇదే అని “డబ్లూహెచ్‌ఓ” డైరెక్టర్ జనరల్ టెడ్రొస్ అథ్నోమ్ ఘ్యాబ్రియోసిస్ చెప్పారు. ఈ మేరకు డబ్లూహెచ్ఓ సభ్య దేశాలన్నింటిని అలర్ట్ చేసింది. ఇది ప్రపంచం అంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది.

కోవిడ్-19 లేదు.. కరోనా తగ్గిపోయింది అని ఎవరికి వాళ్ళు హీరోల లాగా నార్మల్ గా జీవనం సాగిస్తున్నారు, కానీ డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోన్న ప్రకారం, ఒమిక్రాన్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికీ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది, ఇక నుండి అందరూ కరోనా వాక్సిన్ ల మీద మాత్రమే ఆధారపడకుండా సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ లు వాడటం, మాస్కులు ధరించడం తప్పక చేయాలని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ఇప్పటికే ఒమిక్రాన్ వైరస్ 77 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ఇది మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం చాలానే ఉందని హెచ్చరిస్తున్నారు. భారత్ లో కూడా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సిన్ల మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఇతర ముందు జాగ్రత చర్యలపై కూడా ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని కోరింది. ఒమిక్రాన్ ని తేలికగా తీసుకొని జాగ్రతలు పాటించకపోతే ప్రపంచ దేశాలు భారీమూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికే కొన్ని దేశాలు 2 డోసుల వ్యాక్సిన్ తో పాటుగా ఒమిక్రాన్ ని ఎదుర్కొనటానికి బూస్టర్ డోసులని వేయడానికి సన్నద్దం చేశారు.

శిశువుకు తల్లి ఎంత కాలం పాలు పట్టించాలి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది.. ?

పుట్టిన శిశువుకు భయట పాలకంటే తల్లి పాలు అనేది ఎతో శ్రేయస్కరం. శిశువుకు తల్లిపాలు పట్టించడం వల్ల తల్లికి, శిశువుకు ఇద్దరికీ మంచిదని నిపుణులు చెబుతారు. తల్లిపాలు పట్టించడంవల్ల శిశువుకు డయేరియా, వాంతుల సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. అందుకే ప్రతీ సంవత్సరం తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తోంది. పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యల ముప్పు తగ్గుతుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ నుంచి కూడా ముప్పు తగ్గుతుంది.

అయితే కొంత మంది రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు తల్లి పాలు పట్టిస్తే సరిపోతుందని చెబుతుంటారు. కానీ ఐదేళ్ల వరకు తల్లిపాలు పట్టిస్తే తల్లిపాలతో కలిగే ప్రయోజనాలు మరింతగా ఉంటాయంటున్నారు వైద్య నిపుణులు. శిశువులు తాగినంత కాలం, తల్లి ఇవ్వగలిగినంత కాలం తల్లిపాలు పట్టించవచ్చని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్) చెబుతోంది.

ఇందులో భాగంగానే శిశువు రెండో సంవత్సరంలోకి వచ్చాక, తల్లిపాలు ఇవ్వడంతోపాటు ఘన పదార్థాలు తినిపించడం మంచిదని ఎన్‌హెచ్‌ఎస్ వెబ్‌సైట్ చెబుతోంది. తల్లి పాలను శిశువుకు పట్టించే క్రమంలో ఏ వయస్సులో ఆపేయాలన్న నిర్దిష్ట సూచనలు ఏమి లేవని ఎన్‌హెచ్‌ఎస్‌ పేర్కొంది. శిశువుకు మొదటి ఆరు నెలలు ఇతర ద్రవ, ఘన పదార్థాలు ఏవీ ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత నుంచి ఆరోగ్య కారణాల దృష్ట్యా తల్లిపాలతోపాటు ఘన పదార్థాలు తినిపించాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.

అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ఏం చెబుతుందంటే.. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వరకు శిశువుకు తల్లిపాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. రెండు నుంచి మూడేళ్ల తర్వాత తల్లి శిశువుకు పాలు పట్టించాలా.. వద్దా.. అనేది పాలు ఇవ్వడంలో సౌకర్యం, అసౌకర్యం, కుటుంసభ్యుల నిర్ణాయాన్ని బట్టి ఉంటుంది. ఇంగ్లాండ్ లో శిశువు పుట్టాక దాదాపు 80 శాతం మంది మహిళలు కొన్ని వారాలపాటు పాలు ఇస్తారు. తర్వాత చాలా మంది ఆపేస్తారని ఓ నివేదికలో వెల్లడైంది.

ప్రజలకు మరో షాకింగ్ న్యూస్.. మరోసారి లాక్ డౌన్..?

గడిచిన ఎనిమిది నెలల నుంచి దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే దేశంలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ప్రపంచ దేశాల్లో గతంలో కఠినంగా లాక్ డౌన్ అమలైందని.. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారని.. పరిస్థితులు ఇలాగే ఉంటే మరోసారి లాక్ డౌన్ తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వివిధ దేశాల నేతలు, ప్రతినిధులతో డబ్లూహెచ్వో వరల్డ్ హెల్త్ అసెంబ్లీని నిర్వహించింది.

ఈ సమావేశం అనంతరం వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు చేసింది. అమెరికా, యూరప్ లాంటి దేశాలలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో లేకపోవడంతో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం వల్ల మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

మళ్లీ లాక్ డౌన్ విధిస్తే పలు దేశాలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. భారత్ సహా పలు దేశాలకు కరోనా ముప్పు ఉందని కేసులు తగ్గినంత మాత్రాన వైరస్ అదుపులోకి వచ్చినట్టు భావించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

భారత ప్రజలకు శుభవార్త.. కరోనా కష్టాలు తీరినట్టే..?

ఎన్నో రోజుల నుంచి ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూసున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బయటకు వెళ్లామంటే ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా వైరస్ సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది వ్యాక్సిన్ విషయంలో శాస్త్రవేత్తలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ప్రకటనలు ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. అయితే ప్రముఖ ఫార్మా కంపెనీ సీరమ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రజలకు తాజాగా ఒక శుభవార్త చెప్పింది.

త్వరలో 30 కోట్ల మంది ప్రజలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కీలక ప్రకటన చేసింది. సీరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ జాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. డీసీజీఐ నుంచి వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి లైసెన్స్ రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఐదు రకాల వ్యాక్సిన్లను ఉపయోగించి సీరం సంస్థ ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను నిర్వహిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రాధాన్యత జాబితాను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ప్రజలకు 2021 సంవత్సరం మార్చి నెలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. నెలకు 7 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం తమ సంస్థకు ఉందని సీరం సంస్థ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. కేంద్రం మొదట వయోధికులు, పారిశుధ్య కార్మికులు, సిబ్బంది, పోలీసులకు వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

దేశంలోని జనాభాలో 23 శాతం మందికి మాత్రమే తొలి దశలో వ్యాక్సిన్ దక్కనుందని తెలుస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనకా, సీరం సంస్థ వ్యాక్సిన్లు వేగంగా క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంటున్నాయి. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ తొలి వారానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.