పుట్టిన శిశువుకు భయట పాలకంటే తల్లి పాలు అనేది ఎతో శ్రేయస్కరం. శిశువుకు తల్లిపాలు పట్టించడం వల్ల తల్లికి, శిశువుకు ఇద్దరికీ మంచిదని నిపుణులు చెబుతారు. తల్లిపాలు పట్టించడంవల్ల శిశువుకు డయేరియా, వాంతుల సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. అందుకే ప్రతీ సంవత్సరం తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తోంది. పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యల ముప్పు తగ్గుతుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ నుంచి కూడా ముప్పు తగ్గుతుంది.
అయితే కొంత మంది రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు తల్లి పాలు పట్టిస్తే సరిపోతుందని చెబుతుంటారు. కానీ ఐదేళ్ల వరకు తల్లిపాలు పట్టిస్తే తల్లిపాలతో కలిగే ప్రయోజనాలు మరింతగా ఉంటాయంటున్నారు వైద్య నిపుణులు. శిశువులు తాగినంత కాలం, తల్లి ఇవ్వగలిగినంత కాలం తల్లిపాలు పట్టించవచ్చని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్) చెబుతోంది.
ఇందులో భాగంగానే శిశువు రెండో సంవత్సరంలోకి వచ్చాక, తల్లిపాలు ఇవ్వడంతోపాటు ఘన పదార్థాలు తినిపించడం మంచిదని ఎన్‌హెచ్‌ఎస్ వెబ్‌సైట్ చెబుతోంది. తల్లి పాలను శిశువుకు పట్టించే క్రమంలో ఏ వయస్సులో ఆపేయాలన్న నిర్దిష్ట సూచనలు ఏమి లేవని ఎన్‌హెచ్‌ఎస్ పేర్కొంది. శిశువుకు మొదటి ఆరు నెలలు ఇతర ద్రవ, ఘన పదార్థాలు ఏవీ ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత నుంచి ఆరోగ్య కారణాల దృష్ట్యా తల్లిపాలతోపాటు ఘన పదార్థాలు తినిపించాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.
అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ఏం చెబుతుందంటే.. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వరకు శిశువుకు తల్లిపాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. రెండు నుంచి మూడేళ్ల తర్వాత తల్లి శిశువుకు పాలు పట్టించాలా.. వద్దా.. అనేది పాలు ఇవ్వడంలో సౌకర్యం, అసౌకర్యం, కుటుంసభ్యుల నిర్ణాయాన్ని బట్టి ఉంటుంది. ఇంగ్లాండ్ లో శిశువు పుట్టాక దాదాపు 80 శాతం మంది మహిళలు కొన్ని వారాలపాటు పాలు ఇస్తారు. తర్వాత చాలా మంది ఆపేస్తారని ఓ నివేదికలో వెల్లడైంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…