అల్లు అర్జున్ కి ఇప్పుడు ప్రస్తుతం 36 సంవత్సరాలు. అయన ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక విభిన్న పాత్రలో కాస్త డిఫరెంట్ గా చేస్తున్నాడు. ఈ సినిమా అంతా అడవుల్లో దొరికే ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించిన నేపథ్యంలో ఉంటుందని పేర్కొన్నారు. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాలో స్మగ్లర్ గా నటిస్తున్నాడా..? లేక స్మగ్లింగ్ చేసే వారిని పట్టుకునే వ్యక్తిగా నటిస్తున్నాడా అనే విషయం సస్పెన్సులో ఉంది. అయితే అల్లు అర్జున్ నటించే ప్రతి సినిమాలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. అల్లు అర్జున్ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, బాడీ అప్పియరెన్సు విషయంలో సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తాడు. అలాగే ప్రేక్షకుల్లో కూడా అల్లు అర్జున్ ఎలా ఉంటాడో అనే ఆసక్తిని పెంచుతాడు. అభిమానులు సైతం అల్లు అర్జున్ నటించబోయే సినిమా గురించి కుతూహలంగా ఎదురుచూస్తారు. అలాంటి క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో తెప్పించడం మాములు విషయం కాదు. అది ఒక్క అల్లు అర్జున్ సొంతమే.
అల్లు అర్జున్ చిన్నప్పుడు చాలా ఆకతాయిగా ఉండేవాడట. అలాగే చదువు మీద కూడా పెద్ద ఆసక్తి చూపేవాడు కాదట. అలాగే మార్కులు కూడా తక్కువగానే వచ్చేవట. అలా అని చదువు మీద నెగ్లిజెన్సీ చూపించేవాడు కాదు.. అల్లు అర్జున్ లో చిన్నప్పటి నుండే పోటీతత్వం ఉండేదట. ఎవరు అయిన తనకంటే ఎక్కువ మార్కులు సంపాదించుకుంటే, నేను ఎందుకు వాళ్ళ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోలేకపోయాను అని పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకునేవాడట. అలా చదివి పదవ తరగతి పాసైనాడు. అలాగే అల్లు అర్జున్ తండ్రి అయిన అల్లు అరవింద్ కూడా పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చేవాడట. అల్లు అర్జున్ కి ఏది నచ్చితే అదే చేయమని చెప్పేవాడట. అంతేకాని నీ తండ్రి గొప్ప నిర్మాత, నువ్వు తప్పకుండ సినిమాల్లో హీరోగా చేయాలనీ ఆర్డర్లు వేసేవారు కాదట. అలాగే అల్లు అర్జున్ కూడా ఎప్పుడు తాను ఒక గొప్ప నిర్మాత కొడుకునని అహకారం అనేది లేదు. మోదట్లో సినిమాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదంట. యానిమేషన్ రంగం మీద ఎక్కువ ఆసక్తి చూపేవాడట. కొన్నేళ్లపాటు ఆ రంగంలో కూడా పనిచేసాడంట. తరువాత యానిమేషన్ గురించి ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలని కెనడా వెళ్లాలని అనుకున్నాడట. కానీ ఈలోపు ఒక సినిమా చేద్దామని అనుకున్నాడు.
అయితే అల్లు అర్జున్ సినిమాలో నటించాలనుకుంటున్న విషయాన్నీ తండ్రికి తెలియ చేసాడు. అయితే అల్లు అరవింద్ సినిమాల్లో నటించడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎంతో శిక్షణ అనేది అవసరం అని నటనలో ట్రైనింగ్ కోసం బొంబాయి పంపించారు. అప్పుడు అశ్వినిదత్.. అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలనీ అనుకున్నాడు. అలాగే రాఘవేంద్ర రావును తన వందవ చిత్రంలో అల్లు అర్జున్ ను హీరోగా పెట్టి చేయాలనీ మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారట. అలా గంగోత్రి సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చిందట. ఆ చిత్రం మంచి హిట్ సాధించింది. అప్పుడు బన్నీ.. నాకు యాక్టింగ్ వచ్చేసిందని అనుకున్నాడంట. తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాలో హీరోగా చేస్తున్నాడు. అయితే ఒక్కోసారి 30 టేకులు తీసుకున్న గాని షాట్ ను ఓకే చెప్పేవారు కాదట దర్శకుడు. అప్పుడే అల్లు అర్జున్ కి అర్ధం అయిందట. ఇంకా నటనలో నేర్చుకోవాలిసింది చాలా ఉంది అని అనుకున్నాడట. అందుకనే తన సన్నిహితులను, స్నేహితులని అడిగి తన నటనలోని లోపాలను తెలుసుకుని సరిదిద్దుకునేవాడు. అలా ప్రతి సినిమాకు తనదైన స్టైల్ లో వైవిద్యం ప్రదర్శించేవాడు. అందుకనే అల్లు అర్జున్ ను అందరు స్టైలిష్ స్టార్ అని అంటారు.
అయితే ఒకానొక సందర్భాల్లో రజినీకాంత్ సినిమా రోబో షూటింగ్ అప్పుడు కెమరామెన్ ను కలవడానికి సెట్ లోకి వెళ్లి, అతనితో మాట్లాడి తిరిగి వెళ్లిపోతుండగా ఎవరో పిలిచి మిమ్మల్ని రజనీకాంత్ గారు పిలుస్తున్నారు అని చెప్పారట. అప్పుడు అల్లు అర్జున్ ఆశ్చర్యపోయి, వెళ్లి రజినీకాంత్ ను కలిసారట. రజనీకాంత్ అంటే బన్నీకి చాలా ఇష్టం. తాను అభిమానించే హీరో ఎదురుగా ఉండి తనతో మాట్లాతుంటే బన్నీ ఆనందానికి అవధులు లేవంట. నీ సినిమాలు చాలా బాగున్నాయి.. నీ స్టైల్ కూడా బాగుంటుంది. నీకు అమ్మాయిల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కితాబు ఇచ్చారట. రజినీకాంత్ అన్న మాటలకూ అల్లు అర్జున్ ఎంతగానో ఆనందపడ్డాడట.. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ స్వయంగా ఇంటర్వ్యూ లో తెలిపారు. అలాగే అల్లు అర్జున్ ప్రతి సినిమాకు భిన్నంగా నటిస్తాడు.. దర్శక నిర్మాతలు చెప్పినట్లు ఆ సినిమాలో నటించే పాత్రను బట్టి తన బాడీని ప్రిపేర్ చేస్తాడు. సిక్స్ ప్యాక్ కావాలంటే ఎంతో కష్టపడి మరి సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నాడు. దేశ ముదురు సినిమాకు గాను చాలా వర్క్ ఔట్లు చేసాడంట. అలాగే బద్రీనాధ్ సినిమాకు గాను ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇంతలా కష్టపడ్డాడు కాబట్టి అల్లు అర్జున్ కు ఇంతలా అభిమానులు ఉన్నారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…