అమాయకుడిని మోసం చేయాలని చూసిన మహిళా పోలీస్.. చివరకు ఏమైందంటే..!

చట్టం ఎవరికీ చుట్టం కాదు. చేతిలో అధికారం ఉంది కదా.. అని లంచాలకు పాల్పడితే ఏదో ఒక రోజు శిక్ష అనుభవించడం అనేది జరుగుతుంది. ఇలానే ఓ మహిళా పోలీసు ఓ అమాయకుడి దగ్గర డబ్బులు తీసుకొని అబద్దం ఆడింది. చివరకు అతడు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు శివగంగ జిల్లా ఇళయాంకుడికి చెందిన అర్షద్.. ఓ బిజినెస్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అతడికి తెలిసిన వారి వద్ద సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. వాటిని అతడు తన బ్యాగ్ లో భద్రపరుచుకున్నాడు. ఇంకా తనకు డబ్బులు అవసరం ఉండటంతో అతడు తన సోదరుడితో బైక్ పై నాగమలై పుదుకొట్టైకు వెళ్లాడు. అక్కడ అర్షద్ తన సోదరుడు డబ్బులు ఇస్తామన్న స్నేహితుడి కోసం ఎదురుచూశారు. ఆ ప్రదేశానికి అక్కడే పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై వాసంతి వచ్చారు. ఆ బ్యాగ్ లో ఏముందంటూ తీసుకున్నారు.

రేపు స్టేషన్ కు వచ్చి ఆ బ్యాగ్ ను కలెక్ట్ చేసుకోమని చెప్పారు. దీంతో వాళ్లు తెల్లారి స్టేషన్ కి వెళ్లి బ్యాగ్ అడిగారు. అందులో న్యూస్ పేపర్స్ తప్ప.. డబ్బులు లేవని ఆ మహిళా ఎస్సై సమాధానం ఇచ్చింది. దీంతో అతడు మధురై జిల్లా ఎస్పీకి విషయం చెప్పాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వాసంతిని, ఆమె సోదరుడు, మరో ముగ్గురు కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అంతే కాకుండా ఆమెను విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఆమె దీనిపై కోర్టును ఆశ్రయించగా వాదోపవాదనల తర్వాత ఆమె వద్ద రూ.2.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారికి కోర్టు సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధించింది.