కొన్ని ఘటనలు వింటుంటే ఇలా ఎందుకు చేస్తారో.. అలా అవ్వడానికి గల కారణం ఏంటో అర్థం కాదు. సమాజంలో మోసాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా.. చదువుకున్న వాళ్లు కూడా ఇలాంటి వాటికి బలైపోతున్నారు. ఇలా ఓ టీచర్ కు మాయమాటలు చెప్పి ఓ యువకుడు ఆమెను అన్నీ విధాలా వాడుకొని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. చేసేది లేక ఆమె చిరవకు పోలీసులను ఆశ్రయించింది. ఇటు డబ్బు పోయి.. అటు పరువు పోయి.. చివరకు ఆమెకు కన్నీళ్లు తప్ప ఏమి మిగల్లేదు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ బన్స్‌వారాలోని ఘాటోల్‌లో మొబైల్ షాప్ నడిపేవాడు 27 ఏళ్ల ముస్తఫా షేక్ అనే యువకుడు. ఓ రోజు ఫేస్ బుక్ లో వెతికి టీచర్ గా పనిచేస్తున్న 39 ఏళ్ల మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆమె దానిని నాలుగు రోజుల తర్వాత అంగీకరించింది. ఆ రోజు నుంచి ఏవో మాయమాటలు చెప్పి స్నేహం పేరుతో దగ్గరయ్యాడు. ఓ రోజు హైటెక్ డ్రామా ఆడాడు. ఆ డ్రామానే ఆమె పాలిట శాపంగా మారింది.
ఓ రోజు చనిపోతున్నట్లు కాల్ చేశాడు.. ఎందుకు అని ఆమె అడగ్గానే.. నాకు పిల్లలు, భార్య ఉన్నారని.. ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. అందుకే ఇలాంటి పని చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో అతడి మాటలకు ఆ టీచర్ కరిగిపోయింది. అప్పుడు కొంత డబ్బును సాయం చేసింది. ఆ తర్వాత ఓ రోజు కలవాలంటూ.. తన రూంకి తీసుకెళ్లాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిందని చెప్పి.. కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి ఆమెతో తాపించాడు.
మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెను పూర్తిగా వివస్తను చేసి.. వీడియోలు.. ఫోటోలు తీశాడు. ఆమెకు సోయి వచ్చేసరికి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఆమె దగ్గర డబ్బులను వసూలు చేశాడు. దాదాపు రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. అతడిని ఎలాగైనా వదిలించుకునేందుకు అతడికి మరో రూ.5 లక్షలు ఇచ్చింది. అది తీసుకున్న వ్యక్తి మళ్లీ అదే పనిగా.. రూంకి రమ్మనడం.. బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చేస్తుండటంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడు పరారయ్యడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…