పూలు అనేవి సీజన్ లో ఒకసారి పూసేవి ఉంటాయి.. మరికొన్ని సంవత్సరం అంతా పూసేవి కూడా ఉంటాయి. కానీ ఇలా 12 ఏళ్లకు ఒకసారి పూసే పూలను మీరు చూశారా.. కనీసం విన్నారా.. దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.. ప్రకృతి అనేది మానవజాతి ఎన్నో రకాల వనరులను, రమణీయతను ఇచ్చింది. వాటిని చూడాలే కాని మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
ఇలా ప్రకృతి అందాలను ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది. ఇలా కొన్నింటిని చూడాలంటే కర్ణాటకలోని కొడుగు జిల్లాకు వెళ్లాల్సిందే. అక్కడ ఊదా రంగు పూలు 12ఏళ్లకొకసారి పూస్తాయి. వీటినే నీలకురింజి అంటారు. సాధారణంగా 12 ఏండ్లకు ఓసారి మాత్రమే వికసించే ఈ నీలకురింజి పువ్వులు.. ప్రస్తుతం కర్ణాటకలోని మందల్పట్టి పుష్పగిరి, కొట్టే బెట్టా కొండల్లో ఇవి దర్శనమిస్తాయి. వీటిని చూడటానికి పర్యాటకులు వారం రోజులుగా క్యూ కడతారట.
ఇవి సాధారణంగా జూలై-అక్టోబర్ మధ్యలో పూస్తాయి. వీటి పరాగసంపర్కానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఇవి వికసించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు ఈ నీలకురింజి మొక్కలు జీవితకాలంలో ఒక్కసారే పూస్తాయి. మొక్కలు మొలకెత్తిన తర్వాత 12 ఏండ్లకు పూతపూసి, ఆ తర్వాత ఎండిపోతుంది. ఇప్పుడు అక్కడ లాక్ డౌన్ మినహాయించారు కాబట్టి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300-2400మీటర్ల ఎత్తులో ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 45 రకాల నీలకురింజీ పూలు ఉండగా.. అవన్నీ వేర్వేరు ఎత్తులో పెరుగుతుంటాయి.
ఈ నీలకురింజి మొక్కలు ప్రపంచంలోని అన్ని దేశాల్లో పెరుగుతాయట. వీటిలో మొత్తం 250కి పైగా జాతులు ఉన్నాయట. ఆ 250కి పైగా జాతులలో 46 జాతులు భారతదేశంలోనే కనిపిస్తాయట. వీటిని చూడటానికి అక్కడ హెలికాప్టర్ సౌకర్యం కూడా కల్పించారు. కానీ ధర మాత్రం రూ.2.30లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి చాలామంది వాహనాలలో మాత్రమే అక్కడకు వెళ్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…