మరణం అనేది ఎవరికైనా ఉంటుంది. ఈ రోజు కాకపోతే.. మరో రోజైనా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఖాయం. ఒక్కసారి చనిపోయిన తర్వాత ఎవరి శరీరం అయినా నిర్జీవంగానే పడి ఉంటుంది. దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అయితే కొన్ని దేశాల్లో పాములను చంపి.. వాటిని వండుకొని తింటారన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఓ కింగ్ కోబ్రాను చంపి దాని శరీరాన్ని ఓ సూప్ గా తయారు చేసి తినడం చైనా దేశస్తులకు అలవాటు.
వాళ్ళు దానిని ఎంత ఖర్చు అయినా ఇష్టంగా తింటారంట. అయితే ఇలా సూప్ తయారు చేసే హోటళ్లు కూడా అక్కడ చాలా తక్కువగా ఉంటాయట. ఇలా కింగ్ కోబ్రాలను పట్టుకొని హోటల్ కు అమ్మేస్తుంటారు కొందరు. ఇలా ఓ హోటల్ కు కింగ్ కోబ్రాను చంపి తీసుకొచ్చారు కొందరు. అక్కడ చెఫ్ పేరు పెంగ్. పెంగ్ దానిని దగ్గరకు తసుకొని ముక్కలు ముక్కలు గా నరికి .. వాటిని సూప్ తయారు చేసే పనిలో ఉన్నాడు. ఆ ముక్కలను వేడి చేస్తుండగా.. ఆ కింగ్ కోబ్రా తలను అక్కడ నుంచి తీసి డస్ట్ బిన్ లో వేద్దాం అనుకున్నాడు.
దీంతో ఆ కింగ్ కోబ్రా తల భాగాన్ని అతడు పట్టకోగానే ఎగిరి పెంగ్ ను కాటేసింది. దీంతో ఆ హోటల్ అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే హోటల్ సిబ్బంది అప్రమత్తమై వైద్యుల వద్దకు తసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికి విషం మొత్తం అతడి శరీరంలోకి పాకి చనిపోయాడు. అయితే ఇక్కడ అందిరికీ కలిగే సందేహం ఏంటంటే..
చనిపోయిన కింగ్ కోబ్రా మళ్లీ ఎలా కాటేసిందనేగా.. కింగ్ కోబ్రా చనిపోయిన 30 నిమిషాల వరకు తన శరీరంలోని భాగాలు పనిచేస్తాయట. కానీ అతడు చనిపోయిన కింగ్ కోబ్రాను వెంటనే తీసుకొని ముక్కలు చేసి సూప్ చేసేసరికి 20 నిమిషాలు పట్టింది. ఇంకా అది 10 నిమిషాల వరకు బతికే ఉంటుంది. అది తెలియని అతడు దానిని పట్టుకొని ప్రాణాలను తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…